గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జనవరి 2022, సోమవారం

యద్యప్యేతే న పశ్యన్తి.. ||1-38||..//..కథం న జ్ఞేయమస్మాభిః.. ||1-39||..//. అర్జున విషాద యోగము.

 జైశ్రీరామ్.

శ్లో.  యద్యప్యేతే పశ్యన్తి లోభోపహతచేతసః |

కులక్షయకృతం దోషం మిత్రద్రోహే పాతకమ్ ||1-38||

తే.గీ. లోభమునఁజేసి కానరు లోతుగాను,

కులవినాశన కార్యము కొలుపు దోష

ము నిక చేయు ,మిత్రద్రోహమునకు కలుగు

పాపఫలమును నరకపు కూపముకద.,

భావము. 

లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే 

దోషాన్నిమిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక 

పోయినప్పటికీ,

శ్లో.  కథం  జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |

కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||1-39||

తే.గీ.  ఓ జనార్దనా! కులనాశ మొదవునంచు

తెలిసియున్నట్టి మనమేల తెలివితప్పి

యిట్టిపాపంబు చేయగానేల చెపుమ,

పాపదూరులమై యుంటపద్ధతికద.

భావము. 

జనార్ధనాకులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం 

 పాపం నుండి ఎందుకు తొలగ కూడదు?

జైహింద్                                                                                                                                                                                         

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.