గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2020, శనివారం

మత్రజినీద్వయ,కమ్మనమ్మ,హుతవహా,రణమజా,క్షాత్రధర్మ,రజినీకర ప్రియ,అలల వారి,రంజిమా,శివనారీ,గర్భ"-సా రసార"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.


 జైశ్రీరామ్
మత్రజినీద్వయ,కమ్మనమ్మ,హుతవహా,రణమజా,క్షాత్రధర్మ,రజినీకర ప్రియ,అలల వారి,రంజిమా,శివనారీ,గర్భ"-సా రసార"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-సా రసార"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.మ.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వారి వీరి వారి కాదులే!పారు వారి శివ నారే!పార లేవు వారి తీరునన్!
తీర మేల?చేర వేమయా!ధీర వీర చరితానన్!తీరుగాను చేర లేవులే!
సారసా రసార విందమా!చారు శీల వర భూజా!సార కీర్తి నిల్పు మిబ్భువిన్!
పారమార్ధ భావ పూర్ణవై!వారిదంపు జలభంగిన్!పారు మోక్షగామివో!యనన్?
1.గర్భగత"-మత్రజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
వారి వీరి వారి కాదులే!                 పారలేవు వారి తీరునన్!
తీరమేల? చేర వేమయా!             తీరుగాను చేర లేవులే?
సారసా రసార విందమా!             సార కీర్తి నిల్పు మిబ్భువిన్!
పారమార్ధ భావ పూర్ణవై!              పారు మోక్షగామివో?యనన్!
2.గర్భగత"-కమ్మనమ్మ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.న.గగ.గణములు.వృ.సం.59.
ప్రాసనియమము కలదు.
పారు వారి శివ నారే!
ధీర వీర చరితానన్!
చారుశీల వర భూజా!
వారిదంపు జల భంగిన్?
3.గర్భగత"-హుతావహా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వారి వీరి వారి కాదులే!పారు వారి శివ నారే!
తీర మేల?చేర వేమయా? ధీర వీర చరితానన్!
సారసా రసార విందమా!చారు శీల వర భూజా!
పారమార్ధ భావ పూర్ణవై!వారిదంపు జల భంగిన్!
4.గర్భగత"-రణమజా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పారు వారి శివ నారే!పార లేవు!వారి తీరునన్?
ధీర వీర చరితానన్!తీరుగాను చేర లేవులే?
చారు శీల వర భూజా!సార కీర్తి నిల్పు మిబ్భువిన్!
వారిదంపు జల భంగిన్!పారు మోక్షగామివో?యనన్!
5.గర్భగత"-క్షాత్రధర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.మ.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పారు వారి శివ నారే!పార లేవు?వారి తీరునన్!వారి వీరి వారి కాదులే?
ధీర వీర చరితానన్!తీరుగాను చేర లేవులే?తీర మేల?చేర వేమయా!
చారు శీల వర భూజా!సార కీర్తినిల్పు మిబ్భువిన్!సారసా!రసారవిందమా!
వారిదంపు జల భంగిన్!పారు మోక్షగామివో?యనన్!పారమార్ధ భావపూర్ణవై!
6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పారలేవు?వారి తీరునన్!వారి వీరి వారి కాదులే!
తీరుగాను చేర లేవులే?తీర మేల?చేరవేమయా!
సార కీర్తి నిల్పు మిబ్భువిన్!సారసా!రసార విందమా!
పారు మోక్షగామివో?యనన్!పారమార్ధ భావ పూర్ణవై!
7.గర్భగత"-అలల వారి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పార లేవు?వారితీరునన్!వారి వీరి వారి కాదులే!పారు వారి శివ నారే!
తీరుగాను చేర లేవులే?తీర మేల?చేరవేమయా!ధీర వీర చరితానన్!
సార కీర్తి నిల్పు మిబ్భువిన్!సారసా!రసారవిందమా!చారు శీల వర భూజా!
పారు మోక్షగామివో!యనన్!పారమార్ధ భావపూర్ణవై!వారిదంపు జల భంగిన్!
8.గర్భగత"-రంజిమా"-వృత్తము.
అత్యష్టీవృత్తము.ర.జ.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియు కలదు.వృ.సం.
పారు వారి శివ నారే!వారి వీరి వారి కాదులే?
ధీర వీర చరితానన్!తీర మేల? చేర వేమయా!
చారు శీల వరభూజా!సారసా!రసార విందమా!
వారిదంపు జల భంగిన్!పార మార్ధ భావ పూర్ణవై!
9.గర్భగత"-శివ నారీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.మ.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పారు వారి శివ నారే!వారి వీరి వారి కాదులే?పార లేవు?వారి తీరునన్!
ధీర వీర చరితానన్!తీర మేల?చేర వేమయా!తీరుగాను చేర లేవులే?
చారు శీల వరభూజా!సారసా!రసార విందమా!సార కీర్తి నిల్పు మిబ్భువిన్!
వారిదంపు జల భంగిన్!పారమార్ధ భావ పూర్ణవై!పారు మోక్షగామివో!యనన్!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.