గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, మే 2020, శనివారం

వినయశ,భువనా,భుజగశిశురుత,హడలు,సడిచెడు,వడిసుడి,సుడివడి,గడికెడమ,తడువెడలు,తడబడు,గర్భ"-నెడమిడు"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
వినయశ,భువనా,భుజగశిశురుత,హడలు,సడిచెడు,వడిసుడి,సుడివడి,గడికెడమ,తడువెడలు,తడబడు,గర్భ"-నెడమిడు"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
"-నెడమిడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.న.జ.త.న.న.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
కడి నెడమిడి జగమున్!గడగడ లాడ జేసెన్!గడి కెడమన "-కరోనా!
తడబడ కుడి నెడమల్!తడ వెడమిడి దైవమ్!దడ నుడుగతిని మాడ్చున్!
జడు పిడె!కడు కటుతన్!సడి చెడ నెడ మేర్చున్!సడియును విడిచి వేగన్!
పడయడె?సుడి క్రిమినిన్!వడి మృఢు డతి వేగన్!వడి జనులెడద మెచ్చన్!
1.గర్భగత"-వినయశ"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.
ప్రాసనియమము కలదు.
కడి నెడమిడి జగమున్!
తడ బడ కుడి నెడమల్!
జడుపిడె కడు కటుతన్!
పడయడె?సుడి క్రిమినిన్!
2.గర్భగత"-భువనా"-వృత్తము
అనుష్టుప్ఛందము.న.జ.గగ.గణములు.వృ.సం.48.
ప్రాసనియమము కలదు.
గడ గడ లాడ జేసెన్!
తడ వెడమిడి దైవమ్!
సడి చెడ! నెడమేర్చున్!
వడి మృఢుడతి వేగన్!
3.గర్భగత"-భుజగశిశురుత"-వృత్తము.
బృహతీఛందము.న.న.య.గణములు.వృ.సం.428.
ప్రాసనియమము కలదు.
గడి కెడమన"-కరోనా"-
దడ నుడుగతిని మాడ్చున్!
సడియును విడిచి వేగన్!
వడి జను లెడద!మెచ్చన్!
4.గర్భగత"-హడలు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.న.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కడి నెడమిడి జగమున్!గడగడ లాడ జేసెన్!
తడ బడ కుడి నెడమల్!తడ వెడమిడి దైవమ్!
జడు పిడె కటుతన్!సడి చెడ!నెడమేర్చున్!
పడయడె?సుడి క్రిమినిన్!వడిమృడు డతి వేగన్!
5.గర్భగత"-సడిచెచు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.త.న.న.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడగడ లాడ జేసెన్!గడి కెడమన"-కరోనా"-
తడ వెడమిడి దైవమ్!దడ నుడుగతిని మాడ్చున్!
సడి చెడ నెడమేర్చున్!సడియును విడిచి వేగన్!
వడి మృడుడతి వేగన్!వడి జను లెడద మెచ్చన్!
6.గర్భగత"-వడిసుడి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.త.న.న.త.న.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడగడ లాడ జేసెన్!గడి కెడమన"-కరోనా"-కడి నెడమిడి జగమున్!
తడ వెడమిడి దైవమ్!దడ నుడుగతిని మాడ్చున్!తడ బడ కుడి నెడమల్!
సడి చెడ నెడమేర్చున్!సడియును విడిచి వేగన్!జడుపిడె కడు కటుతన్!
వడి మృడుడతి వేగన్!వడిజను లెడద మెచ్చన్!పడయడె? సుడి క్రిమినిన్!
7.గర్భగత"-సుడివడి"-వృత్తము.
ధృతిఛందము.న.న.య.న.న.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడి కెడమన "-కరోనా"-!కడి నెడమిడి జగమున్!
దడ నుడుగతిని మాడ్చున్!తడబడ కుడి నెడమల్!
సడియును విడిచి వేగన్!జడుపిడె కడు కటుతన్!
వడి జను లెడద మెచ్చన్!పడయడె?సుడి క్రిమినిన్!
8.గర్భగత"-గడికెడమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.య.న.న.స.న.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడి కెడమన"-కరోనా"-!కడి నెడమిడి జగమున్!గడగడ లాడ జేసెన్!
దడ నుడుగతిని మాడ్చున్!తడబడ కుడి నెడమల్!తడు వెడమిడి దైవమ్!
సడయును విడిచివేగన్!జడుపిడె! కడుకటుతన్!సడిచెడ!నెడమేర్చున్!
వడి జను లెడద మెచ్చన్!పడయడె?సుడి క్రిమినిన్!వడి మృడుడతి వేగన్!
9.గర్భగత"-తడువెడమ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.త.న.న.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడగడ లాడ జేసెన్!కడి నెడమిడి జగమున్!
తడు వెడమిడి దైవమ్!తడబడ కుడి నెడమల్!
సడిచెడ!నెడ మేర్చున్!జడుపిడె కడు కటుతన్!
వడి మృడుడతి వేగన్! పడయడె?క్రిమి సుడినిన్!
10,గర్భగత"-తడబడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.త.న.న.జ.న.న.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడగడ లాడ జేసెన్!కడి నెడమిడి జగమున్!గడి కెడమన"-కరోనా"-!
తడు వెడమిడి దైవమ్!తడబడ కుడి నెడమల్!దడ నుడుగతిని మాడ్చున్!
సడిచెడ నెడ మేర్చున్!జడుపిడె కడు కటుతన్!సడియును విడిచి వేగన్!
వడి మృడు డతివేగన్!పడ యడె! క్రిమి సుడినిన్!వడి జను లెడద మెచ్చన్!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.