గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2020, బుధవారం

అహమస్మి,సమాశ్రీ,మత్తరజినీ,సత్వర,యతి ర్నవ సుగంథి,చేటు చేష్ట,నీటగు,చింతేల?,నేటికేని,ఉద్వహ,గర్భ"-హతకలి"--వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
అహమస్మి,సమాశ్రీ,మత్తరజినీ,సత్వర,యతి ర్నవ సుగంథి,చేటు చేష్ట,నీటగు,చింతేల?,నేటికేని,ఉద్వహ,గర్భ"-హతకలి"--వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                           
"-హతకలి"--వృత్తము,
ఉత్కృతిఛందము.య.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోనాలొ పెండ్లి సేయగన్!కాటు వేసి చంపితీరు!కాటి కేగు చింతదేలరా?
నిరాశే వరించు జీవులన్!నేటి కైన బుద్ధి నొప్పు!నీటునౌ!సుజీవ మెంచుమా!
బరోసా నొసంగు నాహరే!వాట మొప్పు దారి నెంచు!పాటు మంచి నెంచు దైవమే!                                                                                    
చిరాకేల?తెల్సి మన్నుమా!చేటుచేష్ట దోష మౌను! సాటి వారలందు మేటివై!
                                                                                     
1.గర్భగత"-అహమస్మి"-వృత్తము.
బృహతిఛందము.య.జ.ర.గణములు.వృ.సం.170.
ప్రాసనియమము కలదు.
కరోనాలొ పెండ్లి సేయగన్!
నిరాశే!వరించు జీవులన్!
బరోసా నొసంగ నా హరే!
చిరాకేల?తెల్సి మన్నుమా!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కాటు వేసి చంపి తీరు!
నేటికైన బుద్ధి నొప్పు!
వాటమొప్పు దారి సాగు!
చేటు చేష్ట దోష మౌను!
3.గర్భగత"-మత్త రజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కాటి కేగు చింతదేలరా?
నీటునౌ!సుజీవ మెంచుమా!
పాటు మంచి నెంచు దైవమే!
సాటి వార లందు మేటివై!
4.గర్భగత"-సత్వర"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోనాలొ!పెండ్లి సేయగన్!కాటు వేసి చంపి తీరు!
నిరాశే!వరించు జీవులన్!నేటికైన బుద్ధి నొప్పు!
బరోసా నొసంగు నా హరే!వాట మొప్పు దారి సాగు!
చిరాకేల?తెల్సి మన్నుమా!!చేటు చేష్ట దోష మౌను!
5.గర్భగత"-యతిర్నవ సుగంథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేసి చంపి తీరు!కాటి కేగు చింత దేలరా?
నేటికైన బుద్ధి నొప్పు!నీటునౌ!సు జీవ మెంచుమా!
వాట మొప్పు దారి సాగు!పాటు మంచి నెంచు దైవమే!
చేటు చేష్ట దోష మౌను!సాటి వార లందు మేటివై
6.గర్భగత"-చేటు చేష్ట"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.త.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేసి చంపితీరు!కాటికేగు చింతదేలరా?కరోనాలొ పెండ్లి సేయగన్?
నేటికైన బుద్ధి నొప్పు!నీటునౌ సుజీవ మెంచుమా!నిరాశే!వరించు జీవులన్!
వాటమొప్పు దారిసాగు!పాటు మంచి నెంచు దైవమే!బరోసా నొసంగు నా హరే!
                                                                                   
చేటుచేష్ట దోష మౌను!సాటివార లందు మేటివై!చిరాకేల?!తెల్సి మన్నుమా!
7.గర్భగత"-నీటగు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.య.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటికేగు చింతదేలరా?కరోనాలొ పెండ్లి సేయగన్!
నీటునౌ!సుజీవ మెంచుమా!నిరాశే!వరించు జీవులన్!
పాటు మంచి నెంచు దైవమే!బరోసా నొసంగు నాహరే!
సాటివార లందు మేటివై?చిరాకేల?తెల్సి మన్నుమా!
8.గర్భగత"-చింతేల?"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.య.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటికేగు చింతదేలరా?కరోనాలొ పెండ్లి సేయగన్!కాటువేసి చంపితీరు!
నీటునౌ!సుజీవ మెంచుమా!నిరాశే వరించు జీవులన్!నేటికైన బుద్ధినొప్పు!
పాటు మంచి నెంచు దైవమే!బరోసా నొసంగు నాహరే!వాట మొప్పు!దారిసాగు!                                                                                      
సాటివారు మేలుమేలనన్?చిరాకేల?తెల్సి మన్నుమా!చేటుచేష్ట దోష మౌను!
9.గర్భగత"-నేటికేని"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.త.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేసి చంపితీరు!కరోనాలొ పెండ్లి సేయగన్!
నేటికైన బుద్ధి నొప్పు!నిరాశే!వరించు జీవులన్!
వాటమొప్పు దారిసాగు!బరోసా నొసంగు నా హరే!
చేటుచేష్ట దోష మౌను!చిరాకేల?తెల్సి మన్నుమా!
10,గర్భగత"-ఉద్వాహ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.త.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేసి చంపితీరు!కరోనాలొ పెండ్లి సేయగన్!కాటికేగు చింతదేలరా?
నేటికైన బుద్ధినొప్ప!నిరాశే వరించు జీవులన్!నీటునౌ!సుజీవ మెంచుమా!
వాటమొప్పు దారిసాగు!బరోసా నొసందేలరాజీవులన్మ మంచి నెంచు దైవమే ?                                                                                  
చేటుచేష్ట దోషమౌను!చిరాకేల?తెల్వి మన్నుమా!సాటివారు మేలుమేలనన్!

స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.