గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2020, శనివారం

మత్తరజినీద్వయ,తరంగ,వసుగంథి,యతిర్నవ సుగంథిద్వయ,కొంగు బంగరుద్వయ,రజినీకరప్రియ,కల్పద్రుమ,గర్భ"-గిరివరదమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

 జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,తరంగ,వసుగంథి,యతిర్నవ సుగంథిద్వయ,కొంగు బంగరుద్వయ,రజినీకరప్రియ,కల్పద్రుమ,గర్భ"-గిరివరదమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                       
"-గిరివరదమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగిలోన,మేఘమందునన్!నీటిలోన,గాలిలోన!నీడ,యెండ శ్వాసనుంటివే!
జంగమాల నంటి తిర్గుచున్!చాటుగాను కానరాక!జాడనెంచ వీలుగా నటుల్!
భంగిమాలు గాననీయకన్! బాట,పేట,కోటలందు!పాడుబుద్ధి ప్రాణ ఘాతివై!
నంగనాచి వైతి వేలనే?నాటకాలు మానుమింక!నాడి పట్టు పట్టినా రిలన్!
1.గర్భగత"-మత్త రజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
నింగిలోన,మేఘమందునన్!
జంగమాల నంటి తిర్గుచున్!
భంగిమాలు గాననీయకన్!
నంగ నాచి వైతి వేలనే?

నీడ,యెండ శ్వాస నుంటివే!
జాడ నెంచ వీలుగా నటుల్!
పాడు బుద్ధి ప్రాణ ఘాతివై!
నాడి పట్టు పట్టి నారిలన్!
2.గర్భగత"-తరంగ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.173.
ప్రాసనియమము కలదు.
నీటిలోన,గాలిలోన!
చాటుగాను కానరాక!
బాట,పేట,కోటలందు!
నాటకాలు మానుమింక!
3.గర్భగత"-వసుగంథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగిలోన,మేఘ మందునన్!నీటి లోన, గాలిలోన!
జంగమాల నంటి తిర్గుచున్!చాటుగాను కానరాక!
భంగిమాలు గాన నీయకన్!బాట,పేట,కోటలందు!
నంగ నాచి వైతి వేలనే?నాటకాలు మాను మింక!
4.గర్భగత"-యతిర్నవ సుగంథి ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.రజ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీటిలోన గాలి లోన!నీడ,యెండ,శ్వాస నుంటివే!
చాటుగాను కానరాక!జాడ నెంచ వీలు గానటుల్!
బాట,పేట,కోటలందు!పాడు బుద్ధి ప్రాణ ఘాతివై!
నాటకాలు మాను మింక!నాడి పట్టు పట్టినా రిలన్!

నీటి,లోన ,గాలి లోన!నింగి లోన,మేఘమందునన్!
చాటుగాను కానరాక!జంగమాల నంటి తిర్గుచున్!
బాట,పేట,కోట లందు!భంగిమాలు గాన నీయకన్!
నాటకాలు మానుమింక!నంగనాచి వైతి వేలనే?
5.గర్భగత"-కొంగు బంగరు ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం
నీటిలోన,గాలిలోన!నీడ,యెండ,శ్వాస నుంటివే!నింగిలోన,మేఘమందునన్!
చాటుగాను,కానరాక!జాడనెంచ వీలు గానటుల్!జంగమాలనంటి తిర్గుచున్!
బాట,పేట,కోట లందు!పాడు బుద్ధి ప్రాణ ఘాతివై!భంగిమాలు గాన నీయకన్
నాట కాలు మాను మింక!నాడి పట్టు పట్టినా రిలన్!నంగ నాచి వైతి వేలనే?

నీటిలోన,గాలిలోన!నింగిలోన మేఘమందునన్!నీడ,యెండ,శ్వాస నుంటివే!
చాటుగాను కానరాక!జంగమాల నంటి తిర్గుచున్!జాడ నెంచ వీలుగానటుల్!
బాట,పేట,కోటలందు!భంగిమాలు గాన నీయకన్!పాడు బుద్ధి ప్రాణ ఘాతివై!
నాట కాలు మాను మింక!నంగ నాచి వైతి వేలనే?నాడి పట్టు పట్టి నారిలన్!
6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీడ,యెండ,శ్వాస నుంటివే!నింగి లోన మేఘ మందునన్!
జాడ నెంచ వీలు గానటుల్!జంగమాల నంటి తిర్గుచున్!
పాడు బుద్ధి ప్రాణ ఘాతివై!భంగిమాలు గాన నీయకన్!
నాడి పట్టు పట్టి నారిలన్!నంగనాచి వైతి వేలనే?
7.గర్భగత"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీడ,యెండ,శ్వాస నుంటివే!నింగిలోన,మేఘమందునన్!నీటిలోన,గాలిలోన!
జాడ నెంచ వీలుగానటుల్!జంగమాల నంటి తిర్గుచున్!చాటుగాను కానరాక!
పాడుబుద్ధి ప్రాణ ఘాతివై!భంగిమాలు గాన నీయకన్!బాట,పేట,కోట లందు!
నాడి పట్టు పట్టి నారిలన్!నంగ నాచి వైతి వేలనే?నాటకాలు మాను మింక!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.