గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, మే 2020, శనివారం

మత్తరజినీద్వయ,ముముక్షు,అధునాతన,గతనుతిద్వయ,రుచిమెయి ద్వయ,రజినీకర ప్రియ,పసందగు,,గర్భ"-సత్సంస్కృతి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.


 జయ్ శ్రీరామ్.
 మత్తరజినీద్వయ,ముముక్షు,అధునాతన,గతనుతిద్వయ,రుచిమెయి ద్వయ,రజినీకర ప్రియ,పసందగు,,గర్భ"-సత్సంస్కృతి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                           
"- సత్సంస్కృతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ద.జ.ర.య.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాత చింతకాయ పచ్చడిన్!పసందంచు నొప్పు కొందు!వాడరేమి!నూత్న  సౌ రుచుల్!
పాత చింత కాయునే?భవిన్!వసంతాలు మారుచుండ!పాడి క్రొత్త మార్గ  మెంచుటల్?భూతధాత్రి నూత్న
ఛందముల్!బుసల్గొట్టు నాగు లట్ల?పోడిమిం జెరంతు  రేమొకో?
ద్యోతకంపు భావి శోభలే!దొసంగంచు నెంచ రాదు!తోడు రండి పెంచ సంస్కృతిన్!
                                                                             
1.గర్భగత"'మత్తరజినీద్వయ వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
పాత చింతకాయ పచ్చడిన్!
పాత చింత కాయునే?భవిన్!
భూత ధాత్రి నూత్న ఛందముల్!
ద్యోత కంపు భావి శోభలే!

వాడరేమి?నూత్న సౌ రుచుల్!
పాడి క్రొత్త మార్గ మెంచుటల్!
పోడిమిన్జెరంతు రేమొకో?
తోడు రండి!పెంచ సంస్కృతిన్!
2.గర్భగత"-ముముక్షు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.య.జ.గల.గణములు.వృ.సం.170.
ప్రా నియమము కలదు.
పసందంచు నొప్పు కొందు!
వసంతాలు మారుచుండ!
బుసల్గొట్టు నాగు లట్ల?
దొసంగంచు నెంచ రాదు!
3.గర్భగత"-అధునాతన"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.య.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాత చింతకాయ పచ్చడిన్!పసందంచు నొప్పు కొందు!
పాత చింత కాయునే?భవిన్!వసంతాలు మారుచుండ!
భూతధాత్రి నూత్న ఛందముల్!బుసల్గొట్టు నాగు లట్ల?
ద్యోతకంపు భావి శోభలే!దొసంగంచు!నెంచ రాదు!
4.గర్భగత"-గతనుతి ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.య.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పసందంచు నొప్పు కొందు!వాడరేమి నూత్న సౌ రుచుల్?
వసంతాలు మారుచుండ!పాడి క్రొత్త మార్గ మెంచుటల్!
బుసల్గొట్టు నాగు లట్ల?పోడిమిన్జెరంతు రేమొకో?
దొసంగంచు నెంచరాదు!తోడు రండి పెంచ సంస్కృతిన్!

పసందంచు నొప్పు కొందు!పాత చింతకాయ పచ్చడిన్!
వసంతాలు మారుచుండ!పాత చింత కాయునే?భవిన్!
బుసల్గొట్టు నాగు లట్లు!భూత ధాత్రి నూత్న ఛందముల్!
దొసం గంచు నెంచ రాదు!ద్యోతకంపు భావి శోభలే!
5.గర్భగత"-రుచిమయ ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.య.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమభు కలదు.వృ.సం.
పసందంచు నొప్పుకొందు!వాడరేమి?నూత్న సౌరుచుల్!పాత చింతకాయ పచ్చడిన్!
వసంతాలు మారుచుండ!పాడి క్రొత్తమార్గ మెంచుటల్?పాతచింత కాయునే?  భువిన్!                                             బుస ల్గొట్టు నాగు లట్ల?పోడిమిం జెరంతు రేమొకో?భూత ధాత్రి నూత్న  ఛందముల్!
దొసంగంచు నెంచ రాదు!తోడు రండి పెంచ సంస్కృతిన్!ద్యోతకంపు భావి శోభలే!                                                  
పసందంచు నొప్పు కొందు!పాత చింతకాయ పచ్చడిన్!వాడరేమి?నూత్న సౌ రుచుల్!
వసంతాలు మారుచుండ!పాత చింత కాయునే?భవిన్!పాడి క్రొత్త మార్గ మెంచుటల్?
బుసల్గొట్టు నాగు లట్ల?భూత ధాత్రి నూత్న ఛందముల్!పోడిమిం జెరంతు రేమొకో?
దొసంగంచు నెంచ రాదు!ద్యోతకంపు భావి శోభలే?తోడురండి పెంచ సంస్కృతిన్!  
6.గరభగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియము కలదు.వృ.సం.
వాడరేమి?నూత్న సౌరుచుల్!పాత చింతకాయ పచ్చడిన్!
పాడి క్రొత్త మార్గ మెంచుటల్?పాత చింత కాయునే?భవిన్!
పోడిమిం జెరంతు రేమొకో?భూత ధాత్రి నూత్న ఛందముల్!
తోడు రండి పెంచ సంస్కృతిన్!ద్యోతకంపు భావి శోభలే?
7.గర్భగత"-పసందగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.య.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వాడ రేమి?నూత్న సౌ రుచుల్!పాత చింతకాయ పచ్చడిన్!పసందంచు  నొప్పు కొందు!
పాడి క్రొత్త మార్గ మెంచుటల్?పాత చింత కాయునే?భవిన్!వసంతాలు మారు చుండ!
పోడిమిం జెరంతు రేమొకో?భూత ధాత్రి నూత్న ఛందముల్!బుసల్గొట్టు నాగు లట్ల?
తోడు రండి పెంచ సంస్కృతిన్!ద్యోతకంపు భావి శోభలే?దొసంగంచు నెంచ రాదు!
స్వస్తి.                                                                      
మూర్తి.జుత్తాడ.
జయ్ హింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.