గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మే 2020, మంగళవారం

బప్రాచీన,దశాశ్రీ,మత్తరజినీ,నిర్జరీ,సతత,సురచాతురి,పసందు,మథుమతి,గతులొసంగు,నభయానీ,గర్భ"-అమరాభయ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
బప్రాచీన,దశాశ్రీ,మత్తరజినీ,నిర్జరీ,సతత,సురచాతురి,పసందు,మథుమతి,గతులొసంగు,నభయానీ,గర్భ"-అమరాభయ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                           
"-అమరాభయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.ర.న.భ.య.జ.య.లగ.గణములు.యతులు.10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
జరా మరణాల కావలన్!చతురులై సుర వరుల్!చాలినంత గ్రోలిరే!సుధన్!
చరాచర జీవసంఘమున్!సతతముం శుభగతిన్!జాల మేల నీతి పాత్రతన్!
గరీయపు శోభ ధృగ్గతిన్!గతు లొసంగి వరలన్!కాల చక్ర మెల్ల త్రిప్పుచున్!
పరంబు నొసంగ నిల్చిరే!ప్రతిన బూని వసుధన్!పాలనంబు సేతు రెన్నడున్!
1.గర్భగత"-ప్రాచీన"-వృత్తము.
బృహతీఛందము.జ.జ.ర.గణములు.వృ.సం.174.
ప్రాసనియమము కలదు.
జరా మరణాల కావలన్!
చరాచర జీవ సంఘమున్!
గరీయపు శోభ ధృగ్గతిన్!
వరంబు నొసంగ నిల్చిరే!
2.గర్భగత"-దశాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.భ.లగ.గణములు.వృ.సం.184.
ప్రాసనియమము కలదు.
చతురులై సురవరుల్!
సతతముం శుభగతిన్!
గతు లొసంగి వరలన్!
ప్రతిన బూని వసుధన్!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వో.సం.171.
ప్రాసనియమము కలదు.
చాలినంత గ్రోలిరే సుధన్!
జాల మేల నీతి పాత్రతన్!
కాలచక్ర మెల్ల త్రిప్పుచున్!
పాలనంబు సేతు రెన్నడున్!
4.గర్భగత"-నిర్జరీ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.ర.న.భ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జరా మరణాల కావలన్!చతురులై సుర వరుల్!
చరాచర జీవ సంఘమున్!సతతముం శుభగతిన్!
గరీయపు శోభ ధృగ్గతిన్!గతు లొసంగి వరలన్!
వరంబు నొసంగ నిల్చిరే!ప్రతిన బూని వసుధన్!
5.గర్భగత"-సతత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చతురులై సుర వరుల్!చాలినంత గ్రోలిరే!సుధన్!
సతతముం శుభగతిన్!జాలమేల నీతి పాత్రతన్!
గతులొసంగి వరలన్!కాల చక్ర మెల్ల త్రిప్పుచున్!
ప్రతిన బూని వసుధన్!పాలనంబు సేతు రెన్నడున్!
6.గర్భగత"-సురచాతురి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.య.జ.ర.జ.భ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చతురులై సురవరుల్!చాలినంత గ్రోలిరే!సుధన్!జరామరణాల కావలన్!
సతతముం శుభగతిన్!జాలమేల నీతి పాత్రతన్!చరాచర జీవ సంఘమున్!
గతులొసంగి వరలన్!కాలచక్ర మెల్ల త్రిప్పుచున్!గరీయపు శోభ ధృగ్గతిన్!
ప్రతినబూని వసుధన్!పాలనంబు సేతురెన్నడున్!వరంబు లొసంగ నిల్చిరే!
7.గర్భగత"-పసందు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.జ.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాలినంత గ్రోలిరే సుధన్!జరామరణాల కావలన్!
జాలమేల ప్రీతి పాత్రతన్!చరాచర జీవ సంఘమున్!
కాలచక్ర మెల్ల త్రిప్పుచున్!గరీయపు శోభ ధృగ్గతిన్!
పాలనంబు సేతు రెన్నడున్!వరంబు లొసంగ నిల్చిరే!
8.గర్భగత"-మథువతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.జ.ర.న.భ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాలినంత గ్రోలిరే!సుధన్!జరామరణాల కావలన్!చతురులై సురవరుల్!
జాలమేల ప్రీతి పాత్రతన్!చరాచర జీవసంఘమున్!సతతముం శుభగతిన్!
కాలచక్రమెల్ల త్రిప్పుచున్!గరీయపుశోభ ధృగ్గతిన్!గతులొసంగి వరలన్!
పాలనంబు సేతురెన్నడున్!వరంబు లొసంగ నిల్చిరే!ప్రతినబూని వసుధన్!
9.గర్భగత"-గతులొసంగు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.జ.భ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చతురులై సురవరుల్!జరామరణాల కావలన్!
సతతమున్ శుభగతిన్!చరాచర జీవసంఘమున్!
గతులొసంగి వరలన్!గరీయపు శోభ ధృగ్గతిన్!
ప్రతినబూని వసుధన్!వరంబు లొసంగ నిల్చిరే!
10,గర్భగత"-నభయానీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.జ.భ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చతురులై సురవరుల్!జరామరణాల కావలన్!చాలినంత గ్రోలిరే సుధన్!
సతతముం శుభగతి న్చరాచర జీవసంఘమున్!జాలమేల ప్రీతిపాత్రతన్!
గతులొసంగి వరలన్!గరీయపు శోభ ధృగ్గతిన్!కాలచక్రమెల్ల త్రిప్పుచున్!
ప్రతినబూని వసుధన్!వరంబులొసంగ నిల్చిరే!పాలనంబు సేతు రెన్నడున్!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.