గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2020, బుధవారం

అవధాని ప్రవరులు..3. ..రచన..శ్రీ మద్దూరి రామమూర్తి.

జైశ్రీరామ్.
అ వ ధా ని  ప్ర వ రు లు -  3.
రచన. శ్రీ మద్దూరి రామమూర్తి
నవనీతమ్మగు మానసమ్ముగల ఇందారంపు వాఙ్మూర్తి య
ష్టవధాన ప్రవరుండునై వెలిగి శశ్వత్కీర్తి సాధించె, ధీ
ప్రవణ ప్రస్ఫుట వాక్ప్రసన్న కవితా భాగీరథీమాత తా
ప్రవహత్తుంగ తరంగ గల్ఘల రవ ప్రాగల్భ్య మొప్పార నా
ట్య విలాసమ్మది వద్దిపర్తి రసనన్ హర్షాన నర్తించు నా
కవిరాణ్మౌళిని ప్రస్తుతించెదను. వాగర్థమ్ములన్ దెల్పుచున్
స్తవమున్ గాంచె నమళ్ళదిన్నె
కవి విద్యావామ సద్భక్తుడై,
అవధానం కులజున్ సుధాకరుని దివ్యం
బావధానమ్ములే
అవనిన్ మించియశమ్ముగాంచె
నిక ప్రఖ్యాతుండునై ధన్యుడై
అవధానమ్మున తెల్గు భారతికి దివ్యానందమున్ గూర్చగా
దివిషద్భాషకు దీటుగా తెనుగు నుద్దీపింపగా జేసె తా
నవధానమ్మున పాలకుర్తి కులజుండా శ్యామలానందు స
త్కవి వర్యున్ మనసార గొల్చెదను. పద్మాసీను
భామామణీ
ప్రవిమద్దివ్య కటాక్ష వీక్షణలచే రాజిల్లి గణ్యాత్ముడై
స్తవమున్ గాంచి వధాని యయ్యె ఘనుడాశావాది స్నిగ్ధాత్ముడై,
ఛవిమత్కంకణ ధారియై కవితలన్ సంగీత మాధుర్య మం
జు విలాసాంచిత భవ్య వాగ్రుచి రసజ్ఞుల్ మెచ్చ ధీ రమ్యుడై
యవధానంపు విపంచి మీటు సుకవిన్ ధ్యానాత్ము సుశ్లోకినిన్
కవియౌనాగఫణిన్ దలంచెదను
వాక్చాతుర్య మొప్పారగా
స్తువ గంగాభ తరంగ భంగిమల
నాశుప్రోక్త పద్యాళి పా
టవ మొప్పారగ జాలువారు కవిరాట్ భానుండు శ్రీ మేడసా
ని వరేణ్యున్ వర దివ్య కావ్య సరసీ నిర్మగ్న కావ్యజ్ఞునిన్
ధవుడౌ వేంకటనాథు శ్రీ చరణ ద్వంద్వార్చ్యున్ మదిన్ దల్చెదన్
స్తవమున్ గాంచె వధాని పైడి హరనాథాఖ్యుండు కీర్తి ప్రభన్.
అవలన్ వాక్ప్రతిభా విభాసితులు విద్యా పారగుల్ ధీ గణ
ప్రవరుల్ వ్యాకరణాంశ బోధకులు సూరం వంశజుల్ శ్రీనివా
స విరాజద్గుణ ధన్యులన్ దలచెదన్ సౌజన్య సంస్కారులన్.
కవియౌ కొండపి వంశజున్ మురళినిన్ జ్ఞానాత్ము నెంతున్ మదిన్
కవితామాధురి భావ మంజిమ చమత్కారోక్తి విస్ఫూర్తి లో
క విధానస్థితి బంధ చిత్ర కవితా కాణాచి కావ్యోక్తి వా
గ్వివిధా లంకృత మూర్తిమంత
మగు లక్ష్మీకాంతరాజా
హ్వయున్.
అవధానిన్ నుతియింపశక్యమె.
తగన్ హర్ష ప్రఫుల్లాత్ము,శు
భ్ర విపశ్చిత్కవిరాడ్వధాని కరుణా వర్షాంబువుల్ చాతకం
బు వలెన్ ద్రావుట నావధానిక కళన్ మొల్కెత్తగా సూ
రి వరుండై బహు కావ్యముల్ మలచె గౌరీభట్ల వంశ్యుండు పా
టవమున్ జూపుచు సంస్కృతాంధ్రముల రెంటన్ దిట్టయై వెల్గి ప్రా
భవమున్ జాటెను రామశర్మ కవి. కావ్యాబ్జాళికిన్ బూల తో
ట వివేకాత్తవధాన పుష్పమన కోటా రాజశేఖర్ తుషా
ర విరాజన్నగమై వెలింగె. ఫణతుల్ రామేశ్వరాఖ్యుండు ధీ
ప్రవణుండై యవధాన భాగ్యు
డయి యొప్పారెన్ బుధుల్ మెచ్చ , ర
మ్య వధానంబున మేటియై యలరె ముత్యంపేట వంశాబ్జుడున్
కవియౌ శంకర శర్మ నట్లె ముదిగొండాఖ్యుండు వాగ్భామినిన్ స్తవమున్ జేసి వధాని యయ్యె,నిక పాశ్చాత్యుల్ నుతింపన్ యశో
రవి నేమాని కులాబ్ధి పూర్ణశశి విభ్రాజత్ వధానమ్మునన్
భువిరాజిల్లె వచింప  పాలడుగు
సంభూతుండునౌ శ్రీ చరణ్
ప్రవణత్వమ్మును తెల్పగా తరమె, గీర్వాణాంధ్రముల్ నేర్చె
వా
ఙ్నవభావమ్ముల సద్వధానిగను
శ్రీ నారాయణం సత్కవి
ప్రవరుండయ్యె వచింప నివ్విధి వచోంబా రూపులై యెందరో
నవరాగమ్ములు పల్లవింపగను వాఙ్మాధుర్యముల్ జూపుచున్
నవ లోకమ్ముల తా సృజించు కవులై జ్ఞాన ప్రకాశాత్ములై
స్తవమున్ గాంచిరి.కావ్య లోకమున సంచారంబు గావించు నా
యవధానాఢ్యులె మా వధాన తతికిన్ ఆద్యుల్ నమస్కార సం
స్తవ పుష్పంబులు వారికిచ్చి మదిలో ధ్యానింతు సద్భక్తితో.
దీనిపై నా స్పందన.
అవధానిప్రవరాళి నెంచి కడు స్నేహార్ద్రంపు చిత్తంబుతో

శ్రవణానందముగా పఠించఁ దగు ధారాశుద్ధి నొప్పార, ధీ

వరులౌ మద్దురి రామమూర్తి నుడివెన్. భాస్వంతునీ సత్కవిన్,

గవి సంసేవ్యుని బ్రస్తుతించెదను రాగద్వేష దూరున్ భువిన్.
🙏🏻🙏🏻🙏🏻

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.