జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
51. శా. ఔన్నత్యంబున వెల్గు సజ్జనుల భావౌన్నత్యమే
దుష్టులం
దున్నన్ మేలుగ సాగదే జగతి? భావోదారులై శిష్టులై
పున్నామాదుల చేరకుండి. నిను సత్పూజ్యున్ మదిన్ గొల్త్రు. శ్రీ
మన్నారాయణ ! సత్ప్రవర్ధనమగున్. మంచిన్ ప్రవర్ధించుమా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఉన్నతముగా ప్రవర్తించు సజ్జనులలోనుండే భావౌన్నత్యమే దుష్టులయందునూ ఉండినచో ఈ లోకము మంచిగా కొనసాఢదా ? ఉదార భావులై మంచిగా ప్రవర్తించువారై పున్నామాది నరకమంలకు చేరక సత్పూజ్యుడవయిన నిన్ను తమ మనసులో కొలుతురు. మంచి వృద్ధియగును. అందువలన మంచిని నీవు వృద్ధి చేయుము.
దున్నన్ మేలుగ సాగదే జగతి? భావోదారులై శిష్టులై
పున్నామాదుల చేరకుండి. నిను సత్పూజ్యున్ మదిన్ గొల్త్రు. శ్రీ
మన్నారాయణ ! సత్ప్రవర్ధనమగున్. మంచిన్ ప్రవర్ధించుమా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఉన్నతముగా ప్రవర్తించు సజ్జనులలోనుండే భావౌన్నత్యమే దుష్టులయందునూ ఉండినచో ఈ లోకము మంచిగా కొనసాఢదా ? ఉదార భావులై మంచిగా ప్రవర్తించువారై పున్నామాది నరకమంలకు చేరక సత్పూజ్యుడవయిన నిన్ను తమ మనసులో కొలుతురు. మంచి వృద్ధియగును. అందువలన మంచిని నీవు వృద్ధి చేయుము.
52. శా. ఎన్నాళ్ళీ కొఱగాని కర్మ ఫల దుష్కృత్యంబులం జేయు టిం
కెన్నాళ్ళీ దురపిల్లు కర్మ గతులన్ హేయంబుగానుంట? నీ
వన్నీ జూచుచు మిన్నకుండుదు విదేమైనన్ ప్రమోదంబొ? శ్రీ
మన్నారాయణ! కర్మలం గడిపి, ప్రేమన్ ముక్తి కల్పింపుమా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఎన్నాళ్ళవరకూ ఈ వ్యర్థమైన పురాకృత కర్మఫలములుగా సంప్రాప్తించిన దుష్కృత్యములను చేయుట? ఇంకా ఎన్నాళ్ళు ఈ దుఃఖించు కర్మగతులలో హీనముగా జీవించుట? అన్నీ
నీవు చూచుచుండియు మిన్నకుందువు. ఇదేమైనా సంతోషమా? ఈ కర్మలను పోఁ జేసి ప్రేమతో మాకు ముక్తిని ప్రసాదించుము.
53. శా. కన్నుల్, కాళ్ళును , జేతులున్, దనువు, నోంకారోజ్వలచ్చిత్తమున్,
మన్నైపోయెడి
దేహమున్ , జెవులు , సమ్మాన్యోన్మహజ్జిహ్వయున్ ,
కన్నా ! నీ
కథలాలకించు చెవులున్ , కానంగ నీచేత శ్రీ
మన్నారాయణ !
వెల్గు. నీవరిగినన్ మాయున్ గదా యిన్నియున్.
భావము.
ఓ
శ్రీమన్నారాయణా! బాహ్యేంద్రియములు , జ్ఞానేంద్రియమగు
చిత్తము. నీవు శరీరములో నుండుటచే ప్రకాశించును.
నిత్యుడవైన ఓ హరీ ! నీవు శరీరమును వీడి పోయినచో ఇవన్నియు మాసిపోవును కదా. ప్రాణశక్తివైన నీవే నిత్యుడవు. భౌతికమైన
యీదేహాదులు అనిత్యములే.
54.శా. చెన్నారన్ నను చేర్రఁదీసిన హరీ !
శ్రీనాథ ! సర్వేశ్వరా !
ఎన్నాళ్ళైనను నీ
పదాబ్జములు నా హృత్పీఠిపై నిల్పెదన్.
నిన్నే నమ్మిన
నన్నుబోలు జనులన్ , నిర్భాగ్యులన్
బ్రోచు శ్రీ
మన్నారాయణ ! నీ
కృపన్ దెలుపగా మాకౌనె ? సంపత్ఫ్రదా !
భావము.
ప్రేమతో
నన్ను చేరదీసినవాడవైన ఓ
శ్రీ నాథుడా ! ఓ సర్వేశ్వరా ! ఎంత కాలము గడచినను నేను నీ పాద పద్మములను నా హృదయమనెడి సింహాసనముపైననే
నిలిపి ఉంచెదను. నిన్నుమాత్రమే నమ్మియుండెడి నావంటి ప్రజలను , నిర్భాగ్యులను ప్రోచెడి ఓ శ్రీ మన్నారాయణా ! ఓ
సంపత్ప్రదుడా ! నీకు గల కృపాస్వభావమును
వివరిఃచుట మాకు తరమగునా !
55. శా. నిన్నే నమ్ముచు మన్ననమ్మున మనన్ నే
భావనన్ జేతు, న
న్నెన్నో వేదనలంటి
చిత్తమున నిన్నేకాగ్రతన్ గొల్వనీ
వెన్నాళ్ళీవిధినుంచనెంచితివి? రావేలన్ ననున్ గావ? శ్రీ
మన్నారాయణ! వేదనల్
సమయ నీమంబొప్ప నిన్ గొల్వనా?
భావము.
ఓ
శ్రీమన్నారాయణా! నేను నిన్నే నమ్ముకొని గౌరవముగా జీవించవలెనని భావించుదును.కాని ఎన్నో విధముల బాధలు నా మనసును చుట్టిముట్టి నిన్ను తదేక దీక్షతో
కొలవనీయకున్నవి. ఎన్నాళ్ళీవిధముగా నన్ను నీవు ఉంచవలెననుకొనుచుంటివి? ఈ వేదనలను బాపి నన్ను కాపాడుటకు రావేమి? నా బాధలు సమసిపోయినచో ఏకాగ్రతతో నిన్ను నేని
సేవించుదును కదా!
జైహింద్.