గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, సెప్టెంబర్ 2017, బుధవారం

శివశంకర వృత్త గర్భ సీసము .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

 జైశ్రీరామ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
శివశంకర వృత్త గర్భ సీసము. 
జయవర్ధన, మహితాశ్రయ సరసాత్ముఁడు - హరియే కదామన కనరె బుధులు?
ప్రియ దైవము మన కోరిక వినయాత్మున కొసగున్ - మహత్ కామ్యమొనరఁగూర్చు.
నయమార్గము కరుణామయ నవతేజము లొసగున్ - మహద్ధాత్రిననితరముగ.
భయభక్తుల పరదైవము పదసేవయె - శుభమౌన్ - పరాత్పరుఁజూడనగును.
తే.గీ. ప్రియ కవీశ్వరపాళికి విన్నవింతు - దైవ సంపన్న గాధలన్ తలచి మీరు
కావ్య నిర్మాతలగుచును ఘనతరమగు చిత్రబంధాత్మకున్ హరిన్ జేరఁ గనుఁడు.

సీస గర్భ శివశంకర వృత్తము. ( స న జ న భ స .. యతి 11 )
జయవర్ధన, మహితాశ్రయ సరసాత్ముఁడు హరియే..
ప్రియ దైవము మన కోరిక వినయాత్మున కొసగున్..
నయమార్గము కరుణామయ నవతేజము లొసగున్ ..
భయభక్తుల పరదైవము పదసేవయె శుభమౌన్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శివశంకర వృత్తము సులభ శైలిలో అద్భుతముగా నున్నది. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.