గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, సెప్టెంబర్ 2017, బుధవారం

చెప్పుకోండి చూద్దాం. పద్య చిత్రాలు..

జైశ్రీరామ్.
పద్యచిత్రాలు
తార్కికుల్ నలుగురు తస్కరులేవురు
శ్రోత్రియులిద్దరు చోరుడొకడు
భూసురుల్ ముగ్గురు ముడియవి ప్పొక్కడు
సకలార్ధ నిపుణుడు శాస్త్రియొకడు
యల్లాపు లిద్దరు యాచకు లిద్దఱు
పరివాండ్రు ముగ్గురు బాపడొకడు
ఆగడీ లిద్దఱు, ఆరాధ్యులిద్దఱు
దుష్టాత్ముడైనట్టి దొంగ యొకడు
అరసి వారల నొక శక్తి యశనమునకు
సగము గోరగ నవసంఖ్య జగతిసురుడు
చెప్ప దొంగలు హతులైరి చేటు దప్పి
విజయమందిరి ఆవేళ విప్రులెల్ల!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.