గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, సెప్టెంబర్ 2017, మంగళవారం

ఆటవెలదిద్వయ - దేవరాజ వృత్త - ఉత్సాహ గర్భ సీసము, వరలఁ జేతురయ్య ప్రముఖ బద్య పక్ష వర కవుల్.

జైశ్రీరామ్.
ఆటవెలదిద్వయ దేవరాజ వృత్త - ఉత్సాహ గర్భ సీసము, (దేవరాజ వృత్త న ర న జ భ స .. య తి 11)
నిత్య నిరుపమాన నిర్మల గణనీయ - మార్గ మొసఁగుచున్, బ్రమాణమగుచు,
కృతుల సరస బంధ చిత్ర కవన జాగృ - తంబు సలుపుచున్, సతంబు నిలుపు.
నింక ధరణి నేలునీ తెలుఁ గిదె దర్పి - లంగ మనమికన్ గనంగనుంటి.
మవని వరలఁ జేతురయ్య ప్రముఖ బద్య - పక్ష వర కవుల్. ప్రతీ క్షణమున.
తే.గీ. పద్య పక్షంబు ముగిసినన్ వత్సరంబు,
వత్సరంబది ముగిసిన పంచవర్షి,
పంచ వర్షముల్ ముగియుచో పద్య కావ్య
చయమునకు బాట వేతురు సభ్యులార!

సీస గర్భస్థ ఆటవెలదిద్వయము.
ఆ.వె.౧.  నిత్య నిరుపమాన నిర్మల గణనీయ - మార్గ మొసఁగుచున్, బ్రమాణమగుచు,
కృతుల సరస బంధ చిత్ర కవన జాగృ - తంబు సలుపుచున్, సతంబు నిలుపు.
ఆ.వె.౨.  నింక ధరణి నేలునీ తెలుఁ గిదె దర్పి - లంగ మనమికన్ గనంగనుంటి.
మవని వరలఁ జేతురయ్య ప్రముఖ బద్య - పక్ష వర కవుల్. ప్రతీ క్షణమున.

సీస గర్భస్థ దేవరాజ వృత్తము. (దేవరాజ వృత్త న ర న జ భ స .. య తి 11)
నిరుపమాన నిర్మల గణనీయ మార్గ మొసఁగుచున్, 
సరస బంధ చిత్ర కవన జాగృతంబు సలుపుచున్,
ధరణి నేలునీ తెలుఁ గిదె దర్పిలంగ మనమికన్
వరలఁ జేతురయ్య ప్రముఖ బద్య పక్ష వర కవుల్. 

సీస గర్భస్థ ఉత్సాహ వృత్తము
(సూర్య గణములు 7 పిదప ఒక గురువు. యతి 5వ గణము మొదటి అక్షరము)
నిరుపమాన నిర్మల గణనీయ మార్గ మొసఁగుచున్, 
సరస బంధ చిత్ర కవన జాగృతంబు సలుపుచున్,
ధరణి నేలునీ తెలుఁ గిదె దర్పిలంగ మనమికన్
వరలఁ జేతురయ్య ప్రముఖ బద్య పక్ష వర కవుల్. 
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.