గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, సెప్టెంబర్ 2017, శనివారం

శ్రీ రాజ రాజేశ్వరి, .. .. .. దండక గర్భ షోడశ పాద సీసము

  జైశ్రీరామ్.
ఆర్యులారా! శరన్నవరాత్రులు మనము జగన్మాత కటాక్షము పొంది కృతార్థులమైనాము.
మీ అందరికీ నా అభినందనలు.
రాజ రాజేశ్వరి
శ్లో||  ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం 
శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |
సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం
ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ||
షోడశ కళాపూర్ణ నవదుర్గా స్వరూపిణియైన 
శ్రీ రాజరాజేశ్వరీ జగన్మాత కృపామృతాస్వాదనాసక్తుఁడనైన నాచే విరచింపఁ జేసిన 
దండక గర్భ షోడశ పాద సీసము
శ్రీరాజ రాజేశ్వరీ సర్వ లోకేశ్వ రీ! శాశ్వితానంద! రీతినొసగు.
శ్రీ శైలపుత్రీ! ప్రసీద ప్రసీద ప్రభారాశివోయమ్మ భాతినిమ్ము.
నే బ్రహ్మసచ్చారిణీ కొల్తు నిన్నే సుధారాశివేనీవు. దయను కనుమ.
హే చంద్రఘంటా మహేశానివమ్మా! కృపన్ గాంచుమోయమ్మ. భక్తిఁ గొలుతు.
కూష్మాండమాతా! నిగూఢాంతరంగప్రకాశంబు వీవేను. కరుణఁ జూపు.
మాస్కందమాతా ప్రమత్తుండ నన్ జూచి కాపాడు మాతల్లి కనకవల్లి.
కాత్యాయినీ భవ్య కామేశ్వరీ నీదు కారుణ్యమేనెన్న గలనొ? చెపుమ.
ఓకాళరాత్రీ మహోన్మత్తకాశీమహారాజ్ఞివీవేను యజ్ఞ దగ్ధ!
శ్రీమన్మహాగౌరి చైతన్యమున్ గొల్పి చిత్తమ్మునన్నిల్చు చిత్ప్రభాస!
సిద్ధిదాత్రీ పయోరాశివీవే మహద్దక్షసత్పుత్రి హారతిఁ గొను.
ఈశానివీవేవశింపన్ హృదిన్ మమ్ము రక్షించుచుండంగ ప్రకృతమైన
ప్రాణంబుపై ప్రీతి ప్రాణంబుపై భీతి మాకేలనోయమ్మ! మాకు నీవె
శ్రీకాంతులన్ గొల్పి చేకొంచు మమ్మున్ మహత్కార్యముల్ ప్రీతి నసదృశముగ
చేయింతువమ్మా! విశేషంబుగా నిత్య కల్యాణివీవేను కనకదుర్గ!
నిత్యంబు మాయందు స్తుత్యంబుగానిల్చి కాపాడు మాయమ్మ కల్పవల్లి.
ధాత్రిన్ గృపన్ జూడు తల్లీ! నమస్తే న మస్తేనమస్తేనమఃప్రభాస!
తే.గీ. హారతిగొనుమమ్మా! ధీసుధార్ణవ! ప్రియ
హారతిగొనుమమ్మా! జనహారతిగొనుమ!
దోషపరిహారిణీ శుభపోష జనని.
వందనంబులు. నిలుము మా డెందములను.
సీస గర్భ షోడశ పాద దండకము
శ్రీరాజ రాజేశ్వరీ సర్వ లోకేశ్వ రీ! శాశ్వితానంద!
శ్రీ శైలపుత్రీ! ప్రసీద ప్రసీద ప్రభారాశివోయమ్మ
నే బ్రహ్మసచ్చారిణీ కొల్తు నిన్నే సుధారాశివేనీవు.
హే చంద్రఘంటా మహేశానివమ్మా! కృపన్ గాంచుమోయమ్మ.
కూష్మాండమాతా! నిగూఢాంతరంగప్రకాశంబు వీవేను.
మాస్కందమాతా ప్రమత్తుండ నన్ జూచి కాపాడు మాతల్లి
కాత్యాయినీ భవ్య కామేశ్వరీ నీదు కారుణ్యమేనెన్న
ఓకాళరాత్రీ మహోన్మత్తకాశీమహారాజ్ఞివీవేను
శ్రీమన్మహాగౌరి చైతన్యమున్ గొల్పి చిత్తమ్మునన్నిల్చు
సిద్ధిదాత్రీ పయోరాశివీవే మహద్దక్షసత్పుత్రి
ఈశానివీవేవశింపన్ హృదిన్ మమ్ము రక్షించుచుండంగ
ప్రాణంబుపై ప్రీతి ప్రాణంబుపై భీతి మాకేలనోయమ్మ
శ్రీకాంతులన్ గొల్పి చేకొంచు మమ్మున్ మహత్కార్యముల్ ప్రీతి
చేయింతువమ్మా! విశేషంబుగా నిత్య కల్యాణివీవేను
నిత్యంబు మాయందు స్తుత్యంబుగానిల్చి కాపాడు మాయమ్మ
ధాత్రిన్ గృపన్ జూడు తల్లీ! నమస్తే న మస్తేనమస్తేనమః!

నైవేద్యం : పాయసాన్నంము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
రాజరాజేశ్వరీ దేవి కటాక్ష వీక్షణములలో మనమంతా కృతార్ధుల మైనాము . అందరికీ శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.