గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, సెప్టెంబర్ 2017, బుధవారం

శివశంకర వృత్త గర్భ సీసము .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

 జైశ్రీరామ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
శివశంకర వృత్త గర్భ సీసము
జయవర్ధన, మహితాశ్రయ సరసాత్ముఁడు హరియే కదామన కనరె బుధులు?
ప్రియ దైవము మన కోరిక వినయాత్మున కొసగున్ - మహత్ కామ్యమొనరఁగూర్చు.
నయమార్గము కరుణామయ నవతేజము లొసగున్ - మహద్ధాత్రిననితరముగ.
భయభక్తుల పరదైవము పదసేవయె - శుభమౌన్ - పరాత్పరుఁజూడనగును.
తే.గీ. ప్రియ కవీశ్వరపాళికి విన్నవింతు - దైవ సంపన్న గాధలన్ తలచి మీరు
కావ్య నిర్మాతలగుచును ఘనతరమగు చిత్రబంధాత్మకున్ హరిన్ జేరఁ గనుఁడు.

సీస గర్భ శివశంకర వృత్తము. ( స న జ న భ స .. యతి 11 )
జయవర్ధనమహితాశ్రయ సరసాత్ముఁడు హరియే..
ప్రియ దైవము మన కోరిక వినయాత్మున కొసగున్..
నయమార్గము కరుణామయ నవతేజము లొసగున్ ..
భయభక్తుల పరదైవము పదసేవయె శుభమౌన్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శివశంకర వృత్తము సులభ శైలిలో అద్భుతముగా నున్నది. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.