గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2017, గురువారం

నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, 
అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్.
ఆ.వె.బ్రహ్మకల్పములవి పదికోట్లు గడిచినా
యనుభవించనట్టి యఖిలకర్మ
ఫలములు నశియించవిల జీవ కోటికి
ననుభవింప వలయునఖిలములును.
భావము. అనుభవించకుండా కర్మ ఫలము కోటి బ్రహ్మ కల్పములు గడిచిననూ నశింపదు. అది శుభమైననూ, అశుభమైననూ దాని ఫలమును మనము తప్పక అనుభవింపవలసినదే.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును నిజం. చేసిన కర్మ ఫలం అనుభవించి తీరవలసిందే . మంచి విషయం తెలియ జెప్పారు. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.