గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఆగస్టు 2017, మంగళవారం

"మాహాత్మ్యస్య సమగ్రస్య (భగవంతుఁడు నిర్వచనము) . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. "మాహాత్మ్యస్య సమగ్రస్య  ధెైర్యస్య యశస శ్శ్రియ: 
జ్ఞాన వైరాగ్యయో శ్చైవ షణ్ణాం - భగ ఉచ్యతే
ఇత్యుక్త భగోZస్యాస్తీ తి భగవాన్"
గీ. వినుత మాహాత్మ్యమును, ధైర్యమనునదియును
యశము సంపద జ్ఞానము విశదమయెడి
గొప్ప వైరాగ్య మనునవి కూడ భగము.
కూడి భగవంతుఁడనఁబడి కొలువఁ బడును.
భావము. 1) మాహాత్న్యము. 2) ధైర్యము. 3) యశస్సు. 4) సంపద. 5) జ్ఞానము. 6) వైరాగ్యము, అనే ఆరింటిని షడైశ్వైర్యములు అందురు. వీటికే "భగ" అని పేరు. ఈ ఆరు ఐశ్వైర్యములను సంపూర్ణంగా కలిగి ఉండుట వలననే "భగవంతుడు" అని పేరు కలిగినది.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
భగవంతుడు అనేపదమునకు విలువైన అర్ధమును తెలియ జెప్పినందులకు కృతజ్ఞతలు . నిజంగా మన సంస్కృతి మేలిమి బంగారమె

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.