గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఆగస్టు 2017, శుక్రవారం

నూతన ఛందములలో గర్భ కవిత 107. . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్.
చరిత గర్భస్మృతిప్రోక్తవృ్తము.రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
స్మృతిప్రోక్త వృత్తము.
కలకాలముండునేసిరి కదులాడుచుపరులంటున్ కనవేమిటీనిజంబున్
నిలుపౌనుదానధర్మము నిదురేలవిడుమాయన్నినదించువేద భాష్యమ్.
పలుకెంచుసత్యశోధన పదిలంబదికృతపుణ్యం పనిగొంచువిన్నమోక్షం.
వెలుగిచ్చిసౌఖ్యమేర్చును విదితంబిదిస్మృతిప్రోక్తం వెనుదిర్గపాపమోపున్.
1.కలకాలముండునే సిరి
నిలుపౌను దానధర్మము
పలుకెంచు సత్య శోధన
వెలుగిచ్చి సౌఖ్యమేర్చును.
2.కదలాడుచుపరులంటున్
నిదురేల విడుమాయన్
పదిలంబది కృతపుణ్యం
విదితంబిది స్మృతి ప్రోక్తం.
3.కనవేమిటీనిజంబున్
నినదించువేదభుష్యమ్
పనిగొంచువిన్న మోక్షమ్
వెనుదిర్గ పాపమోపున్.
4.కలకాలముండునేసిరి కదలాడుచుపరులంటున్ 
నిలుపౌనుదానధర్మమునిదురేలవిడుమాయన్
పలుకెంచుసత్యశోధన నిదురేలవిడుమాయన్
పలుకెంచుసత్య శోధన పదిలంబదికృతపుణ్యం.
5.కదలాడుచుపరులంటున్ కనవేమిటీనిజంబున్ 
నిదురేలవిడుమాయన్ నినదించువేదభాష్యమ్
పదిలంబదికృతపుణ్యం పనిగొంచువిన్నమోక్షమ్
విదితంబిదిస్మృతిప్రోక్తం వెనుదిర్గ పాపమోపున్.
6.కదలాడుచుపరులంటున్ కనవేమిటీనిజంబున్ కలకాలముండునేసిరి.
నిదురేలవిడుమాయన్ నినదించువేదభాష్యమ్ నిలుపౌనుదానధర్మము
పదిలంబదికృతపుణ్యం పనిగొంచువిన్నమోక్షమ్ పలుకెంచుసత్యశోధన
విదితంబిదిస్మృతిప్రోక్తం వెనుదిర్గపాపమోపున్ వెలుగిచ్చిసౌఖ్యమేర్చున్.
7కనవేమిటీ నిజంబున్ కలకాలముండునేసిరి 
నినదించు వేదభాష్యం నిలుపౌనుదానధర్మము
పనిగొంచువిన్నమోక్షమ్ పలుకెంచు సత్యశోధన
వెనుదిర్గపాపమోపున్  వెలుగిచ్చి సౌఖ్యమేర్చున్.
8.కనవేమిటీనిజంబున్ కలకాలముండునేసిరి కదలాడుచుపరులంటున్
నినదించువేదభాష్యం నిలుపౌను దానధర్మము నిదురేలవిడుమాయన్
పనిగొంచువిన్నమోక్షమ్ పలుకెంచుసత్యశోధన పదిలంబదికృతపుణ్యమ్
వెనుదిర్గపాపమోపున్ వెలుగిచ్చి సౌఖ్యమేర్చున్ విదితంబిస్మృతిప్ప్రోక్తమ్.
9.కదలాడుచుపరులంటున్ కలకాలముండునేసిరి
నిదురేలవిడుమాయం నిలుపౌనుదానధర్మము
పదిలంబదికృతపుణ్యం పలుకెంచుసత్యశోధన
విదితంబిదిస్మృతిప్రోక్తం వెలుగిచ్చిసౌఖ్యమేర్చున్
10.
కదలాడుచుపరులంటున్ కలకాలముండునేసిరి కనవేమిటీనిజంబున్
నిదురేలవిడుమాయం నిలుపౌనుదానధర్మము నినదించువేదభాష్యమ్
పదిలంబదికృతపుణ్యంపలుకెంచు సత్యశోధన పనిగొంచువిన్నమోక్షమ్
విదితంబిదిస్మృతిప్రోక్తం వెలుగిచ్చిసౌఖ్యమేర్చున్ వెనుదిర్గపాపమోపున్.

స్మృతిప్రోక్త ఉత్కృతి .స.జ.భ.స.న.త.స.జ.గగ.యతులు 10.19.
కందళీ .బృహతీ స.జ.భ.వృ.సం.428.
2.సన్నయ.బృహతీ స.న.య.వృ.సం.124.
3.జడిపిలు .అనుష్టుప్ వృ.సం.44.
4.పరచర.ధృతి.స.జ.భ.స.న.య.యతి10
5.నడయాడు .అత్యష్టీ స.న.య.స.జ.గగ.యతి10.
6.చలనా.ఉత్కృతి స.న.య.స.జ.త.జ.ర.లల.యతులు10.18.
7.నియతి.అత్యష్టీ స.జ.త.జ.ర.లల.యతి9.
8.నిజ .ఉత్కృతి స.జ.త.జ.ర.న.జ.న.గగ.యతులు9.18.
9.సనయా ధృతి.స.న.య.స.జ.భ.యతి10.
10.చరిత ఉత్కృతి స.న.య.స.జ.భ.స.జ.గగ.యతులు10.18.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.