గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2017, సోమవారం

ధర్మే తత్పరతా, ముఖే మధురతా, (సత్పురుష వైభవం) మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. ధర్మే తత్పరతా, ముఖే మధురతా, దానే సముత్సాహతా
మిత్రేzవంచకతా, గురౌ వినయతా, చిత్తేzతిగంభీరతా, 
ఆచారే శుచితా, గుణే రసికతా, శాస్త్రేషు విజ్ఞానతా,
రూపే సుందరతా, శివే భజనతా, సత్స్వేవ సందృశ్యతే.
ఉ.ధర్మమె రూపమౌన్ నయ సుధా పరిభాషణ, దాన శీలమున్,
మర్మము లేని మైత్రి, గురు మానిత భక్తియు, చిత్త శోభ, సత్
కర్మల శౌచమున్, సుగుణ గ్రాహ రసజ్ఞత, శాస్త్ర బోధయున్,
భర్మ శరీర శోభ,శివ భక్తి, మహాత్ముల యందు తెల్లమౌన్.
భావము. ధర్మాచరణమునందు ఆసక్తి, నోటియందు మధురభాషణము, దానము చేయుటయందు సమధికోత్సాహము, మిత్రుల యందు మోసబుద్ధి లేకుండుట,గురు జనుల పట్ల వినయము, మనస్సులో గాంభీర్యము, ఆచారాలను పాటించటంలో శుచిత్వము,సద్గుణ గ్రహణములో రసజ్ఞత, శాస్త్ర జ్ఞానము కలిగి యుండుట,రూప సౌందర్యము, పరమేశ్వర సేవ, అనే లక్షణాలు సత్పురుషులయందు మాత్రమే గోచరిస్తూ ఉంటాయి. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.