గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, నవంబర్ 2015, గురువారం

ఆశయా బధ్యతే లోకే . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచిన్తయా |
ఆయుః క్షీణం న జానాతి తస్మాత్-జాగ్రత జాగ్రత ||
आशया बध्यते लोके कर्मणा बहुचिन्तया ।
आयुः क्षीणं न जानाति तस्मात्-जाग्रत जाग्रत ॥
ఆ.వె. పాప పుణ్య ఫలిత బహుచింతనములచే
నాశఁ దగులు లోక మనవరతము.
గడిచిపోవు వయసు పొడనైనఁ గనలేరు
కనుక జాగృతినిల మనఁగఁ దగును.
భావము. లోకులు తమ కర్మ ఫలముల చేత, అనేక చింతల చేత ఆశాపాశ బద్ధులై ప్రవర్తించుదురే కాని గడిచిపోవుచున్న్ ఆయువును చూడజాలేరు. కావున జాగ్రత్తాగా ప్రవర్తించ వలసి యున్నది.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తరుగుతున్న ఆయువును గురించి ,చేయవలసిన భగవధ్యానమును గురించీ ఆలోచించరు గానీ పొందని కోరికల్నీ మిగిలి పోయిన బాధ్యతల్నీ తలుచు కుంటూ గడిపేస్తారు . అదేలోకం తీరు
బాగుంది మంచిసూక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.