గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, నవంబర్ 2015, శుక్రవారం

అపర గాంధీ శ్రీ నితీష్ చొరవతో కాబోతున్న మద్య రహిత బీహార్

జైశ్రీరామ్.
బీహార్ ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీనితీష్ కుమార్ గారికి హృదయ పూర్వక అభినందనలు.
01 - 04 - 2016 నుండి బీహార్ రాష్ట్రములో మద్యపానమును పూర్తిగా నిషేధించటానికి వర్యలు చేపట్టి నందులకు గర్విస్తూ, మీరు ముఖ్యమంత్రి అయినందులకు చాలా సంతోషిస్తున్నాము. నిజంగా మీరు తీసుకొన్న ఈ నిర్ణయం పూర్తిగా కార్యరూపం దాలిస్తే గాంధీ మహాత్ముఁడు కలలు కన్న భారతికి మీరు నాందీ పలికినవారవతారు. 
మీరు చేపట్టిన ఈ సత్కార్యము మిగిలిన రాష్ట్రాలకు కూడా మార్గదర్శకం కావాలని, భారతమాత ఆనందంతో పులకరించాలని మనసారా కోరుకొంటూ,  మీరు చేపట్టే మంచి పనులకు ఆ పరమాత్మ ఎల్లప్పుడూ సహకరించాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.
Print this post

3 comments:

sarma చెప్పారు...

ఈ చర్య కితం సారి తీసుకుని ఉంటే జనం నమ్మేవారేమో! ఇప్పుడు అసాధ్యం, కొంతమంది బాగుకే ఇది. విజయం కావాలనే ఆకాంక్ష

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సంకల్ప బలముంటే సాధ్యం కానిదేదీ లేదు. తప్పక నెరవేరు గాక

Zilebi చెప్పారు...


శ్రీ నితీష్ గారిని అపర గాంధీ అనేసారు ! ఇంకా ఏమేమి జరుగ బోతుందో !

జిలేబి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.