గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, నవంబర్ 2015, ఆదివారం

కర్కోటకస్య నాగస్య . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్.
క. ఇల కర్కోటక నాగు న . . . 
మల నల దమయంతులను సుమతి ఋతుపర్ణున్
కొలిచిన కలిదోషంబులు
కలుఁగవు మది కొలువుఁడిక ప్రకాశము పొందన్.
భావము: కర్కోటకుడు అనే నాగు ని, దమయంతి నలుడు అను  పుణ్య దంపతులని, ఋతుపర్ణుడు అను పేరుఁగల రాజర్షిని తలచుకొనినచో మానసిక రోగములు, కలి వలన కలిగెడి పీడలు తొలగిపోవును.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నలుని కాటు వేసి వికృత రూపమును కలిగించినది కర్కోటకుడే గదా .మంచి సంగతి చెప్పారు .ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.