గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, నవంబర్ 2015, సోమవారం

మా గురువుదేవులు శ్రీమాన్ గోవిందాచార్యులవారు, శ్రీమాన్ రామ రాజు గారు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేను ౧౯౬౮ - ౬౯,  ౬౯ - ౭౦,  ౭౦ - ౭౧,  ౭౧ - ౭౨ సంవత్సరములలో ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ చేయుచున్న సందర్భములో శ్రీమాన్ గోవిందాచార్యులవారు , శ్రీమాన్ రామరాజుగారు సంస్కృతకావ్యములు, తెలుగు కావ్యములు బోధించెడివారు.
 నేను ఎడ్మిషన్ టెష్ట్ టు భాషాప్రవీణ పరీక్ష వ్రాయుటకు వెళ్ళినప్పుడు శ్రీ గోవిందాచార్యుల వారి యింటనే ఉన్నాను. అమ్మగారైతే ఎంతో ఆప్యాయంగా కన్నబిడ్డను సాకినట్టు ఎంతో ఆత్మీయతతో మాటాడుతూ  అల్పాహారము, భోజనము పెట్టి చూచారు. ఆ మహాయిల్లాలి చేతి వంటకమును భుజించిన దాని ఫలమే నా యొక్క యీ సుఖజీవనము, సాహిత్య ప్రియత్వమూను.
ఏమోయ్యంచుముదంబుతోడ నను తామిష్టాప్తితో పిల్చి, సత్
ప్రేమన్ జూపుచు సాకినట్టి మహిత శ్రీ వైష్ణవీ వైష్ణవుల్
శ్రీమాన్ సద్గురు మూర్తి పత్నియును సుశ్రేయఢ్య గోవిందులున్.
ప్రేమన్ వారికి నంజలించెదను మహచ్ఛ్రేయంబు నాకిచ్చుటన్.
లక్శ్మీనారాయణులవంటి మా గోవిందాచార్య దంపతుల ఋణము తీర్చుకో లేనిది. వారికి నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
శ్రీమాన్ రామరాజుగారు కూడా ఆత్మీయతతో మమ్ములను చేరదీసి ఎంతో ప్రేమగా చూచేవారు. వారికి కూడా పాదాభివందనం చేస్తున్నాను.
ప్రస్తుతము వీరంతా విజయనగరంలోనే నివాసముంటున్నారు.
వీరంతా ఆ పరమాత్మ కృపకు పాత్రులై ఆయురారోగ్యాలతో సుఖమయ జీవనం గడుపుతూ దీర్ఘాయుష్మంతులై మా కనుల వెలుగై ఉండాలని మనసారా అదేవుని ప్రార్తించుచున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గురువులు దైవాంస సంభూతులు . మాకందరికీ పూజనీయులు .అందుకే ఇక్కడ చూడగలుగు తున్నాము వారిరువురికీ శిరసు తాటించి పాదాభి వందనములు .
క్షీరాబ్ధి ద్వాదశి పర్వ దినాన మంచి అవకాసము కలిగించి నందులకు శ్రీ చింతా సోదరులకు అభినందనలు .ఆశీర్వదించి అక్క .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.