గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జులై 2014, బుధవారం

భద్రం కృతం కృతం మౌనం...మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. భద్రం కృతం కృతం మౌనం కోకిలైర్జలదాగమే
దుర్దురా యత్ర వక్తారః తత్ర మౌనం హి శోభనమ్.
క. కప్పలు వక్తలగుతరిన్ 
దప్పక కోకిలలు మౌన ధారణ చేయున్. 
గొప్పలు పల్కెడి కుకవులు 
చెప్పునచట పండితులిక చెప్పకునికి మేల్.
భావము. వానకాలము రాగానే కప్పలే వక్తలౌతాయి కనుక, కోకిలలు మౌనాన్ని ఆశ్రయించటమే శోభిస్తుంది !
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవునుమరి కోయిలకీ కప్పలకీ నింగీ నేలా అంత దూరం రెండిటికీ పోటీ కుదరదు బాగుంది మంచి సూక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.