గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జనవరి 2014, గురువారం

అమృతము, మృత్యువు మనలోనే ఉన్నాయి. మేలిమి బంగారం మన సంస్కృతి 150.

జైశ్రీరాం.
శ్లో. అమృతం చైవ , మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం
మోహాదాపద్యతే మృత్యుః , సత్యేనాపద్యతేమృతమ్. (ఆది శంకరులు)
క. మృత్యువు నమృతము కనపడు 
సత్యము. మన దేహమందె సహవసియించున్
మృత్యువు మోహము వలనను
సత్యముచే నమృత శక్తి సరసత నిలుచున్. 
భావము. అమృతము, మృత్యువు ఈ రెండూ మన శరీరంలోనే ఉన్నాయి. మోహం వల్ల మృత్యువు , సత్యం వల్ల అమృతత్వము కలుగును. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బాగుంది అందరు తెలుసు కోవలసిన మంచి పద్యము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.