గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జనవరి 2014, శుక్రవారం

విద్యా రత్నం మహా ధనమ్ . మేలిమి బంగారం మన సంస్కృతి 147

జైశ్రీరామ్
శ్లోజ్ఞాతిభిః వంచతేనైవ - చోరేణాపి ననీయతే.
దానేన నక్షయం యాతి, - విద్యా రత్నం మహా ధనమ్.
గీజ్ఞాతి వంచనకెరగాని జాతిరత్న 
మందనట్టిది చోరుల, కనవరతము
దానమును చేయుచున్నను దరుగనట్టి 
జాతి రత్నంబువిద్య విఖ్యాత ధనము.
భావము విద్య అనెడి రత్నము మనకు గొప్ప ధనము. జ్ఞాతులు మనలను వంచించి తీసుకొనుటకు వీలు లేనిది, దొంగలు అపహరింప జాలనిది.దానమెంతగా చేసినను తరుగనటువంటిది.
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.