గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జనవరి 2014, సోమవారం

శ్రీ విజయ నామ సంవత్సర మకర సంక్రాంతి శుభాకాంక్షలు

జైశ్రీమన్నారాయణ!
ఆశ్రిత సద్గుణ ధనులగు ఆర్యులకెల్లన్
సుశ్రేయము కొలుపగ నే
నా శ్రీమద్వేంకట పతి నర్ధింతు నెదన్.
రవి శుభ సద్గతిన్ మకరరాశిని చేరెడు పుణ్య కాలమున్ 
నవనవ కాంతులీ భువికి నవ్యత కూర్చెడు నార్యులార! మీ
రవిరళ శోభనావళిని హాయిగ గాంచుచు నిర్మలాత్ములై
కవులను గౌరవించుచు సుఖంబును కొల్పుడు మంచి మాటలన్.
మకర సంక్రాంతి మీకిడు సకల సుఖము
లాయురారోగ్యములు. శుభాహ్వయులఁ జేయు.
నిరుపమానంద పూర్ణులై వరలుడింక
పెద్దలందరి దీవన లొద్దిక గని.
జైహింద్.
Print this post

4 comments:

సురేష్ బాబు చెప్పారు...

మీకు,మీ కుటుంబ సభ్యులకు భోగి,సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు.

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు,మీ కుటుంబ సభ్యులందరికి శ్రీ విజయ నామ సంవత్సర మకర సంక్రాంతి శుభాకాంక్షలు !

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శ్రీ చింతా వారికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

Sandeep P చెప్పారు...

చక్కని కవిత్వంతో నూతన సౌరమాన సంవత్సరాన్ని ఆహ్వానించారు, రామకృష్ణారావు గారు! మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోఱుకుంటున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.