గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జనవరి 2014, శుక్రవారం

కవివతంస బులుసు కంఠోద్భవ సుస్వరరూప స్వీయ రచన

జైశ్రీరాం.
ఆర్యులారా1 విశ్వనాధ భావుకతను అసాధారణ భావనా వైవిధ్యంతో వెలువరించి, ఆంధ్రామృత పాఠకుల మనములందు స్థిరుడై నిలిచిన మన కవివతంస బులుసు వేంకటేశ్వర్లు గారి కంఠోద్భవ సుస్వరరూపస్వాయ రచనామృతాన్ని గ్రోలండి.


భారత మాత రక్షణకు ప్రాణము లొడ్డెడి రక్షకాగ్రణీ!
ధీరుఁడవైన నీ ప్రతిభ దేశవిదేశములందు వెల్గగా
సౌరును జూపుచున్ బులుసు సత్కవి వంధ్యుఁడు వేంకటేశ్వరుల్  
గారవ మొప్ప పాడి మొనగాడుగ నిన్విరచించె. కాంచితే?

ఇట్టి కవీశులిద్ధరణి నీవిధి నిన్ గొలువంగనుండగా 
మట్టిని కల్పి వైరులను మాతృ ఋణంబును తీర్చు శక్తి రా
కెట్టులనుండు నీకు? సుకవీంద్రుడు మాతృ ఋణంబు తీర్చె నిన్ 
   బట్టి స్తుతించుటన్. కలుగు పాండితి కీఫలితమ్ము చాలదే!   

బులుసు కవీద్రులకభినందనలు.
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.