నీమము,నేరని,తమోపహ.క్షేమకా,భద్రకా,విష్టప,పుష్టిదా,స్తోమ,ధీమ,సత్వనిధి,మృత్యుంజయ,జ్ఞాపికా,శాంతాకార,గర్భ-"మనోజ్ఞ"-వృత్తము,
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
-
జైశ్రీరామ్.
మనోజ్ఞ:-వృత్తము,
నీమము మీర నేర నయా!నిష్టను వీడ నెన్నడున్!నీమా!నా మనంబీవే!శివా!
సోమ తమోప సత్వ నిధీ!సుష్టిగ పుష్టి నీ గదే!స్తోమా!ధీమ!ఓంకారంబువై!
భ...
1 వారం క్రితం
3 comments:
చక్కటి కార్యక్రమాన్ని అంధించినందుకు ధన్యవాదాలు
గురువు గారికి నమస్సులు.
నవసాహిత్యము బంధ చిత్రముల సంధానించుచున్ దీప్తులై
యవిభాజ్యమ్ముగ సాహితీ ప్రియులకాహ్లాదంబు చేకూర్చి మా
కవధానప్రతిభావిషేషముల దీవ్యత్చిత్రరాజంబు మీ
రవిరామమ్ముగ నందజేసితిరి యార్యా! మా ప్రణామంబిదే.
సమ్మోదంబగు బంధ చిత్ర గతులన్ శ్లాఘించుచున్, నాపయిన్
సమ్మాన్యంబగు భావనన్ నిలుపుచున్, సంభావనా వైఖరిన్
సమ్మోదమ్మును గొల్పితీవు మదికిన్, సర్వత్ర సద్భావనన్
సమ్మాన్యుండవు. నీకు దీవనలు. లసత్ సంపత్కుమారా! వరా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.