గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, డిసెంబర్ 2013, శనివారం

నిత్య సాధన చంద్రిక

జైశ్రీరాం.
ఆర్యులారా! మనము నిత్యమూ జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా సౌఖ్యంగా గడపాలని ప్రతీ ఒక్కరం ఆశిస్తుంటాం. ఆ ఆశ నెరవేర్చుకొనుట కొఱకు తెలిసినంత వరకూ మాత్రమే మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. మన పెద్దలు తాము గడించిన దివ్యాతిదివ్యానుభవ సారాన్ని సూక్తులుగా మనకందించారు. అట్టి అవశ్యాచరణీయములైన అంశాలను ప్రవచనాల ద్వారా అనేక మంది  మహత్ ప్రవక్తలు మానవ జాతికి నిత్యమూ అందిస్తూనే ఉన్నారు. అందుకొంటూనే ఉంటాము, మరల మర్చిపోతూనే ఉంటాము. ఇది ఆ విధంగా జరగ కూడదంటే మనం ఆచరణలో వాటిని పెట్టితీరాలి.అప్పుడు మాత్రమే మన నడవడిక కూడా ఇతరులకు అనుసరణీయంగా ఉండి తీరుతుంది.
ఇక అట్టి నిత్యము అనుసరణీయమైనవి మనకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు ప్రవచించి యున్నారు అవి ఈ క్రింది ఆడియో మూలమున విననగును.అవి విని నిత్యము  సాధన చేస్తూ మనము కోరుకొనే సన్మార్గంలో మన జీవన యానాన్ని ఆనంద భరితం చేసుకొంటూ సాగిద్దాం. ఇక వినండి.
విన్నారుకదండీ! ఇక ఆలస్యమెందుకు సాధన చేద్దామా! ఐతే కానివ్వండి. శుభమస్తు. 
జైహింద్. 
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...
"నిత్య సాధన చంద్రిక " ఆడియో అద్భుతంగానున్నది, మాకందించిన మీకు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారికి ధన్యవాదములు ...

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కోటి పుణ్యాల ఫలము శ్రీ కోటేస్వర రావు గారి ప్రవచనము అందుకే వారు బ్రహ్మశ్రీ
ఆంధ్రామృతము అందించిన అదృష్టము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.