గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, అక్టోబర్ 2013, బుధవారం

శ్రీమాన్ వైద్యం వారు చిత్రీకరించిన బంధత్రయము.

జైశ్రీరామ్.
ఆర్యులారా!మహా కవి కాణాదం పెద్దన సోమయాజి కృత అధ్యాత్మ రామాయణం లోని విశ్వ ముఖ మత్స్యత్రయ బంధ చంపకము కలదు. దానిని   20-8-2013 వ తేదీన ప్రచురించియున్నాను. ఈ విశ్వ ముఖ మత్స్యత్రయ బంధమునకు నేను ఊహించి చిత్రమును రూపొందింపగా శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు ఇంకనూ మెఱుగులు దిద్ది ఈ క్రింది విధముగా చిర్తీకరించి యున్నారు. పరిశీలనార్థము, అపురూపమైన అభిప్రాయ వ్యక్తీకరణార్థము మీ ముందుంచుచున్నాను. తిలకించుడు.
అటులనే 
జాంబవత్పాద బంధమును డా.జీయస్ గణపతిరావుగారి సూచనను గ్రహించి ఆచార్యుల వారు నిర్మించిన జాంబవత్పాద బంధమును కూడా తిలకించండి.
ఇక పుష్ప బంధ చిత్ర స్రగ్ధరా వృత్తమును స్వయముగా శ్రీమాన్ ఆచార్యులవారు రూపించి చూపిన విధమును తిలకించండి.
చూచారు కదా! ఇంత చక్కని కృషి చేయుచున్న శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారిని మనసారా అభినందిస్తున్నాను.
మీ అమూల్యమైన సూచనలకొఱకు ఎదురుచూస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆణి ముత్యముల వంటి చిత్ర బంధ నైపుణ్యంతో మావంటి వారిని బంధించ గలిగిన సాహితీ స్రష్ట శ్రీ మాన్ వైద్యం వేంకటేశ్వ రాచార్యుల వారికి ప్రణామములు
మరిన్ని రచనలను మాకందించాలని కోరుతూ విశాల హృదయులు శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.