గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, అక్టోబర్ 2013, ఆదివారం

శ్రీ అనంత భాస్కర శతక ఆవిష్కరణము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మొన్నను నల్లకుంటలోని శంకర మఠముసత్సాంప్రదాయబద్ధముగా జరిగినది.
శ్రియానందస్వాములవారు ఈ కార్యక్రమమునకు అధ్యక్షత వహించగా శ్రీ దూళిపాళ ప్రభాకర కృష్ణ మూర్తి (నిడదవోలు)గారు ఆధ్యాత్మిక పరముగా ఈ శతకమును సమీక్శించిరి. ఈ శతకమునందలి చిత్ర, బంధ, గర్భకవిత, వ్యంజన చిత్ర, నామ గోపనాది చిత్ర రచనా   వైచిత్రిని నేను వివరించితిని. గుణ గ్రహణ పారీణులైన సభికులుపుష్ప గుచ్ఛములు దుశ్శాలువాదులతో శతక కవి యగు శ్రీ నారుమంచి అనంత కృష్ణ గారిని సత్కరించి అభినందించి, వారి ఆనందమును తెలియ జేసిరి. ఇంత చక్కని శతకరచన చేసి ఆవిష్కరణము జరిపి కృత కృత్యులైన కవివతంసుని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

5 comments:

సో మా ర్క చెప్పారు...

అనంత కృష్ణ గారికి నా అభినందనలు పరోక్షంగా అందజేయ ప్రార్ధన.కార్యక్రమం దిగ్విజయంగా జరిపించిన మీకు నా ధన్యవాదాలు.

సో మా ర్క చెప్పారు...

రామకృష్ణ కవిగారూ!అనంత కృశ్ణ గారికి నా హృదయ పూర్వక సతాధిక వందన మందారాలనందజేయ నా కోరిక.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వేదిక నలంక రించిన సరస్వతీ పుత్రులకు ప్రణా మములు
మా కందించిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అలరఁగఁ జేయనందరిని హాయిగపల్కెడి సోదరీమణీ!
సులలిత భావనా పటిమ, సుందర భాషణ, సూనృతత్వమున్,
కలుగుట చేసి, మీ పలుకు, గౌరవమున్ కలిగించునాకిలన్
వెలయగ చేయు చుండె సువి వేకము, సత్ కవితా విధానమున్,

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మీ అందరి పండితోత్తముల రచనలు చదవ గలిగిన అదృష్టం నాకు లభించడం నా పూర్వ జన్మ సుకృ తాన్ని మాత్రం తెలియ జేయ గలుగు తున్నందుకు చాలా ఆనందం గాఉంది అంతటి మహద్భాగ్యాన్ని కలిగించి నందుకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.