గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, అక్టోబర్ 2013, సోమవారం

విజయ దశమి సందర్భముగా సుజన పాళికి నా శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
సాహితీ మిత్రులారా! నేడు శుభప్రదమైన శ్రీ విజయ నామ సంవత్సర విజయ దశమి. ఈ సందర్భముగా మానవ జాతికంతటికీ శుభాలు చేకూరాలని మనసారా కోరుకొంటున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ఏ తల్లి చిరు నవ్వు లెల్ల లోకాలను చూచుచు నిరతము కాచు చుండు,
ఏ తల్లి చిరునవ్వు లెట్టి దుర్మతినైన సద్వర్తునిగ భువి సలుపుచుండు,
ఏ తల్లి చిరునవ్వు లిహ పర సౌఖ్యమ్ము లెల్ల సుకవి పాళి కిచ్చి, బ్రోచు,
ఏ తల్లి చిరునవ్వు  లీ సృష్టి మూలమై మంగళప్రదమునై మహిమఁ గాచు,
నట్టి యా తల్లి చిరునవ్వు లనుపమ గతి
పొంద, సేవించి, ధన్యులౌ పుణ్య మతుల
పాద ధూళియె శుభదంబు. భక్త పాళి
నరసి దుర్గమ్మ రక్షించి, హాయి గొలుపు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
విజయ దశమి సందర్భముగా అందరికీ శుభా కాంక్షలు
ధన్య వాదములతో

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.