గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2012, శనివారం

పదవీ విరమన చేయుచున్న శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి అభినందనలు.

శీరస్తు                       శుభమస్తు                అవిఘ్నమస్తు
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు 
ప్రథానోపాధ్యాయ పదవీ విరమణ చేయుచున్న సందర్భముగా 
 తేదీ. 30 – 6 - 2012 న సమర్పించిన
న వ ర త్న మా లి క 
రచన:- చింతా రామ కృష్ణా రావు.

:- శ్రీ రమణీయమౌ బులుసు చిన్మయ వంశజ వేంకటేశ్వరుల్ 
ధీర కవీశ్వరుల్. పదవి తీరగ నేడిక విశ్రమించు. బో
ధా రమణీయ సత్కవి వతంసుని దర్పిల వృద్ధిఁ గొల్పఁగా
శ్రీ రమణీ సమేతుఁడగు శ్రీహరి నిత్యము వెంట నుండెడున్. 1

సీ:- బులుసు వంశజ కృష్ణ మూర్తియు సుబ్బల - క్ష్మియు నేమి పుణ్యంబు చేసి కొనిరొ
కవివతంసుఁడు కల్గె కన్న బిడ్డగనింట. - వేంకటేశ్వర్లుగా విశ్వ మలమె.
భువనేశ్వరిన్ బట్టి పుడమిని వెలుగుచు. - శివ చరణ్ సత్పుత్రు నవనిఁ బడసె.
గాయత్రి కోడలై గౌరవంబును పెంచె. - పౌత్రుని, పౌత్రినిఁ బడసి వెలిసె.
గీ:- విశ్వ విఖ్యాత పాండితి వెల్లువగుచు 
కవితగా పొంగమువ్వయై కమ్మనైన
సవ్వడులు పండితుల మది చక్క నిలిచె
వేంకటేశ్వర్లుపండుగవెలుగులీనె 2.

సీ :- ఉంకించి ఉద్యోగ మొప్పుగా చేయనా లంకెల పాలెంబు లక్ష్యమొప్ప
చేరి ఏడేండ్లటన్ చేవను చూపించి, - పదవినున్నతిఁ బొంది ప్రబల మీరు
నర్సింగపల్లిలో నయమొప్పగా చేరి - మూడేండ్లు ఘన కీర్తి మూట కట్టి,
చిట్టివలస చేరి శ్రీ జ్ఞాన దీప్తులన్ - వెలయఁ జేసి కీర్తి వెలయఁ జేసి,
గీ:- చేరి రానందపురమును శ్రీకరముగ 
చేసిరి పదేండ్లచట . గొప్ప చేవఁ జూప
తాటి తూరున హెచ్చెమ్ము దైవమనగ 
చేరి, చేసిరి. మీ సాటి లేరు నిజము. 3

:- కవి సామ్రాట్ ఘన విశ్వనాథు రచనల్ కంఠస్థమై యొప్పునాన్ 
సవిమర్శంబుగ కల్ప వృక్ష సుగతుల్ సర్వంబునుం జెప్పు మీ
శ్రవణానంద సుగాత్ర మాధురి వినన్ సామాన్యులుం బండితుల్ 
శ్రవణానందము కాగ మిమ్ముఁ బొగడున్. సత్పాండితీ శోభితా! 4.

:- ఘన సత్ కావ్యముఁ బోలు మువ్వ రచనం గన్పించు సత్ కల్పనా 
ప్రణవోద్భాసిత కావ్య శక్తి. విలసద్బ్రహ్మంబునే జూపు. ని
ర్గుణమట్లే సగుణంబు వ్యక్త పరచున్. క్షోణిన్ బ్రభా పూర్ణమై 
ఘన సత్కావ్యతఁ గొన్న మువ్వకు నమస్కారమ్ము గావించెదన్. 5.

:- ప్రచురణమైన సత్కథలు పండుగఁగా కని యందు రంద రీ 
రచయిత యెంత లౌకికుఁడొ ! వ్రాసినదెల్లయు సత్యసాక్ష్యమై
సచివుల యుల్లముల్ కదిపె.. సంస్కరణంబులఁ జేయఁ జేసె. స 
ద్వచనమె సత్కథా గతిని వర్ధిలఁ వ్రాసిరటంచు మిత్రమా ! 6.

:- శ్రీ కర సద్విశుద్ధ వర సిద్ధి ప్రలబ్ధ ప్రబుద్ధ జ్ఞాన ర 
త్నాకర ! కల్ప వృక్ష వసనా ! మహి మాన్విత వాగ్విభావ ! సత్
ప్రాకటమైన శ్రీ బులుసు భవ్య కులాంబుధి సోమ ! వేంకటే 
శా ! కమనీయ కావ్య విలసత్కవి ! శోభిలు వాఙ్నిధానవై ! 7.

.చంపక –౨..మధ్యాక్కర .నర్కుట - కోకిలక –౫.మణి భూషణ.ద్రుతవిలంబిత   .  . ౧౦  ద్వివిధ కంద ద్వయ –  ౧౧. .గీత –  ౧౨ చతురంగ గతి బంధ ఆటవెలది ౧౩. .చతురంగ గతి బంధ కంద గర్భ
సీసము.:- భువి గణ మూలమౌ బులుసు ప్రోద్గుణ మూల - భ్రూధరార్యకున్ ఘన సుకవికి
కవి గణ కాల సంకల, కమ్మని కల్మి - కి! ఖ్యా ధరార్యకున్ కీర్త్య మతికి,
కవి జన కాలువల్ కలయ గాంచు నగోన్న - తఖ్యాతివాని శోధన సుమతికి,
భవితను భా లసద్ వలజ పైనను వర్ధి - ప్రాక్ , వేల్పనన్ దండమిడుదు.
గీ:- కవన విజయ నుఁ ! కళ వలె కవు 
కవిత. సుగుణ, యల, నుడులు!
కవి నెదఁ ను సుకవి కఱుకని వలువల  
నిగనిగ లుబుకు నిధి నిడి నిలుపును ధర. 8.

. :- 
భువి గణ మూలమౌ బులుసు ప్రోద్గుణ మూలక భ్రూధరార్యకున్ 
కవి గణ కాల సంకల, కమ్మని కల్మికి! ఖ్యా ధరాఢ్యమౌ ,
కవి జన కాలువల్ కలయ గాంచు నగోన్నతఖ్యాతివాని శో 
భవితను భా లసద్ వలజ పైనను వర్ధిత ప్రాక్ , వేల్పనన్

. మధ్యాక్కర:- 
భువి గణ మూలమౌ బులుసు ప్రోద్గుణ మూలక భ్రూధ 
కవి గణ కాల సంకల, కమ్మని కల్మికి! ఖ్యా .
కవి జన కాలువల్ కలయ గాంచు నగోన్నతఖ్యాతి
భవితను భా లసద్ వలజ పైనను వర్ధిత ప్రాక్ .

.. నర్కుటము:- 
భువి గణ మూలమౌ బులుసు ప్రోద్గుణ మూలక భ్రూ 
కవి గణ కాల సంకల, కమ్మని కల్మికి! ఖ్యా ,
కవి జన కాలువల్ కలయ గాంచు నగోన్నతఖ్యా .
భవితను భా లసద్ వలజ పైనను వర్ధిత ప్రాక్

. కోకిలకము:- 
భువి గణ మూలమౌ బులుసు ప్రోద్గుణ మూలక భ్రూ
కవి గణ కాల సంకల, కమ్మని కల్మికి ఖ్యా!
కవి జన కాలువల్ కలయ గాంచు నగోన్నతఖ్యా
భవితను భా లసద్ వలజ పైనను వర్ధిత ప్రాక్.

. మణి భూషణము:-
మూలమౌ బులుసు ప్రోద్గుణ మూలక భ్రూధరా 
కాల సంకల, కమ్మని కల్మికి! ఖ్యా ధరా
కాలువల్ కలయ గాంచు నగోన్నతఖ్యాతివా 
భా లసద్ వలజ పైనను వర్ధిత ప్రాక్ జవే

. ద్రుతవిలంబితము:- 
బులుసు ప్రోద్గుణ మూలక భ్రూధరా
కల, కమ్మని కల్మికి! ఖ్యా ధరా ,
కలయ గాంచు నగోన్నతఖ్యాతివా
వలజ పైనను వర్ధిత ప్రాక్ జవే!

ద్వివిధ కంద ద్వయము:-
౭.గణ మూలమౌ బులుసు ప్రో 
ద్గుణ మూలక భ్రూధరార్యకున్ కవి గణ కా
జన కాలువల్ కలయ గాం 
చు నగోన్నతఖ్యాతివాని శోభ వితను భా!

.జన కాలువల్ కలయ గాం 
చు నగోన్నతఖ్యాతివాని శోభ వితను భా!
గణ మూలమౌ బులుసు ప్రో 
ద్గుణ మూలక భ్రూధరార్యకున్ కవి గణ కా

.గణ కాల సంకల,  
మ్మని కల్మికి! ఖ్యా ధరాఢ్యమౌ కవి జన కా
తను భా లసద్ వలజ పై 
నను వర్ధిత ప్రాక్ , వేల్పనన్ భువి గణమూ!

౧౦. తను భా లసద్ వలజ పై 
నను వర్ధిత ప్రాక్ , వేల్పనన్ భువి గణమూ,
గణ కాల సంకల,  
మ్మని కల్మికి! ఖ్యా ధరాఢ్యమౌ కవి జనకా!

౧౧. గీ:- బులుసు ప్రోద్గుణ మూలక భ్రూధరార్య
కల, కమ్మని కల్మికి! ఖ్యా ధరాఢ్య ,
కలయ గాంచు నగోన్నతఖ్యాతివాని
వలజ పైనను వర్ధిత ప్రాక్ , వేల్ప !

౧౨. చదరంగబంధ .వె:- ( కలతల - నెఱుఁగని - బులుసును - కనవలె.)
కవన విజయ నుఁ ! కళ వలె కవు 
కవిత. సుగుణ, యల, ను!
కవి నెదఁ ను సుకవి కఱుకని వలువల 
నిగనిగ లుబుకు నిధి నిడి నిలుపును .


           వి        నుఁ
      ళ            లె    
వు         వి     .  సు   గు
   త              ను
క   వి    నె  దఁ      ను సు   
వి     ఱు       ని     లు    
   ని      ని      లు  బు   కు
ని   ధి    ని   డి   ని  లు  పు   ను

౧౩..చతురంగ బంధ కం:- కలతల - నెఱుఁగని - బులుసును - కనవలె.)
కవన విజయ నుఁ ! కళ  
వలె కవు కవిత. సుగుణ, యల, న్!
కవి నెదఁ ను సుకవి కఱు 
కని వలువల నిగ నిగ లుబుకు నిధి నిడి నిలుపున్.

           వి        నుఁ
!      ళ            లె    
వు         వి     .  సు   గు
   త      ,          న్
క   వి    నె  దఁ      ను సు  
వి     ఱు       ని     లు    
   ని      ని      లు  బు   కు
ని   ధి    ని   డి   ని  లు  పు    న్

:- మంగళమీ మహా కవికి, మంగళమౌత కుటుంబమంతకున్
మంగళమౌత మిత్రులకు, మంగళమౌత కవీశ్వరాళికిన్.
మంగళమౌత లోకులకు మంగళమౌ నుత భారతాంబకున్
మంగళమౌత శ్రీపతికి, మంగళమౌత సమస్త సృష్టికిన్. 9.

మంగళమ్                                మహత్                              శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
Print this post

4 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ బులుసు " వారి కల్ప వృక్షం " చదివాక .....ప్చ్ ! మాటలు రావు .ఇక విశ్రాం తులుగా మరిన్ని సుందర కావ్యాలను అందించ గలరని ఆశిస్తూ . అంతటి మహా కవికి హృదయ పూర్వక శుభా కాంక్షలు చెప్పగలనే గానీ పొగడగ నేనెంత ? నాది ఒక చిన్న కలం . ధానికి లేదంత బలం .
మంచి పద్య రచన తో అభి నందిం చిన శ్రీ చింతా వారు శ్లాఘ నీయులు.

రాధేశ్యామ్ రుద్రావఝల చెప్పారు...

అద్భుతం,
మహాద్భుతం,
పరమాద్భుతం..

రాధేశ్యామ్ రుద్రావఝల చెప్పారు...

అద్భుతం,
మహాద్భుతం,
పరమాద్భుతం..

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరక్కయ్యా గారూ! రాధేశ్యామ్ గారూ! ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.