గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జూన్ 2012, శుక్రవారం

అహంకారమనే అసురుని జయించగలమా? జి.కన్నయ్య


జైశ్రీరామ్.
పైన పడుతున్న అహంకారాసురుఁడు నిలా జయించాలి.
సుహృద్బాంధవులారా! మనం ఔన్నత్యము పొందుతున్న సందర్భంలో అహంకారమనే అసురుఁడు మనలనాశ్రయిస్తాఁడు. అంతే అది మొదలు పతనం ప్రారంభమౌతుంది. అందుకే మనం అహంకారాసురుని జయించాలి. ఈ విషయాన్ని తెలిపే ఒక చక్కని కథను శ్రీ జి. కన్నయ్య గారు ఏం చెప్పారో మీరే చూడండి.
అహంకారసురుఁడు జి.కన్నయ్య.
అనాదినుండి తమ ప్రవృత్తుల ద్వారా దేవాసురుల మధ్య సంగ్రామములు జరుగుచుండెడివి.  ఒకమారు దేవాసురుల మధ్య ఒక దారుణ యుద్దము జరిగెను. దెవేంద్రుడు అగ్ని వాయు దేవుల సహకారముతో యుద్దము చేసెను. ఇంచుమించుగా దానవులు అందరు మరణించారు. హతసేషులు  పారిపోయారు. ఆ యుద్ధములో అగ్ని వాయువుల పరాక్రమము అందరికి ఆశ్చర్యము కలిగించెను. సర్వే సర్వత్ర అందరు వారి పరాక్రమమునే పొగడసాగిరి. దేవతలకు  గొప్ప కీర్తి లభించెను. ఆ కారణముగనే ప్రజలు ప్రలోభపడి సర్వేశ్వరుని విస్మరించి దేవతలనే పుజింప నారంభించిరి. దానితో దేవతలకు గర్వమెక్కువాయెను. లోకము అంతయు మనలనే పూజించుచుండగా  మనము ఇంకొకరిని పూజించనేల అని అహంకరించిరి. పరమేశ్వరుఁడు సర్వ శక్తి సంపన్నుఁడు అన్న విషయమే మరచిరి. కరుణాసముద్రుడైన పరమెశ్వరుడు అమరుల అహంకారమునకు జాలిపడి ఘనులు విజయశ్రీ సముపేతులైనచో మరింత వినయశీలురు   అగుదురుకానీ గర్వింపరు. అందువల్ల వారు పతనము చెందకుండా గర్వమును సమూలముగా నాశనము చేయ తలెచను.
ఒకనాడు నందనోద్యానమందు అమరేంద్రుని  సభ యేర్పాటు చేయఁబడినది. దేవతలు తమతమ ఘనతలను ప్రశంసించుకొనుచు ఘర్షన  పడుతుండగా సమీపమున  కన్నులు మిరుముట్లు కొలుపు కాంతితో ఒక యక్షుడు ఆకాశమునుండి దిగెను. ఆ తెజస్సు   ముందు అగ్ని కాంతి హీనుఁడయ్యెను.  దేవతలందరికీ యక్షుని గాంచినంతనే వదనములు పాలిపొయెను.  గడచిన యుద్ధములో ప్రతాప శ్రేష్టుఁడైన  వ్రేతిహొత్రుని కడకు  వళ్ళి ఆ యక్షుని సమాచారమును తెలుసుకొని రమ్మని కోరిరి. అతనిని సమేపించుటకు  అగ్నికి అడుగులు తడబడ సాగెను. యక్షుని తేజస్సుకు అగ్ని కన్నులు మూతబడెను. ఎట్టకేలకు అతనిని సమేపించి మాటలాడు ధైర్యము లేక ఊరకుండెను. యక్షుడు అతనిని గాంచి  నాయన నీవెవరవు? అని ప్రశ్నించెను. నా పేరు అగ్ని నన్ను జాతవేదుడు అనికూడ అంటారు.   తమరు యెవ్వరో తెలుసుకొను ఉద్దేశముతో వచ్చినాడఁను అని పలికెను. ఆందుకు యక్షుడు  ఓ అగ్నీ! నీవు చేయు పని యెట్టిదో చెప్పగలవా? అనెను. అగ్ని దుఃఖముతొ  ఓ తేజోవంతా మీరు అగ్ని చేయు  కార్యమునే ఎఱుఁగరా? క్షణ మాత్రములో ఈ ప్రపంచమునంతను భస్మము చేయఁగల శక్తి నాకు కలదు. ఆకాశమండలి నక్షత్రములు కూడా నా శక్తి వల్లనే వెలుగొందుతూ ఉన్నది అని పలికెను. అగ్ని అహంకారము నసించలేదని  గ్రహించిన    యక్షుడు ఒక గడ్డి  పరకను ముందుంచి  అగ్ని దేవా నీ  శక్తిని నేను ఎఱుఁగుదును.   ఈ గడ్డిని దగ్ధము చేసి నీ పరక్రమమును చూపుమనెను. మరియు అగ్ని తేజస్సును హరించెను. అగ్ని శత విధముల ప్రయత్నించి విపఫలుడయ్యేను. సిగ్గు పడి పాలిన ముఖముతో దేవేంద్రుని చేరెను.
పిదప దేవతలు వాయు దేవుని  పంపిరి ఆ తెజోవంతుని సమీపించుటతో వాయువుకు అతనిని చూచుటకు కుడా కష్టమాయెను. యక్షుడు సోదరా నీవెవరవు ఏ  నిమిత్తమై వచ్చితివి? అనెను. వాయువు కొంత ధైర్యము తెచ్చుకొని మహాపురుషా! నన్నే ఎఱుఁగరా? నన్ను వాయుదేవుడు అంటారు .సకల జీవనాధారము నా యందే ఉన్నది. నిరాటంకముగా చరించు శక్తి గలవాఁడనగుటచే వారంతా నన్ను మాతరిశ్వుఁడు అని కుడా పిలచెదరు. అనెను యక్షుడు గర్వముతోకుడిన వాయు దేవుని ముఖమును  కనినతోనే  వాయువు ధైర్యము నశించి శక్తి హీనుఁడాయెను. యక్షుడు సోదరా! నీవేమి చేయుదువు అనిన  నా శక్తితో ఈ బ్రహ్మాండమునంతను ఊపి వేయఁగలను  అనిన, యక్షుఁడు సోదరా! నీ ఎదుట గల తృణమును ఎగురఁగొట్టి నీ బలమును చూపుమనెను. అంత వాయువు  సర్వ విధముల ప్రయత్నించి గడ్డిపరకను కదప లేక సిగ్గుతో తల వంచుకొని దేవేంద్రుని చేరెను.
అగ్ని వాయువులు పరాభూతులు కాగా దేవేంద్రుడు బృహస్పతిని గాంచి మార్గమేమి? అనెను. బృహస్పతి దేవేంద్రునితో అమరేంద్రా ఆ తెజోవంతుని సమాచారము తెలుసుకోన నీకు వినా మరొకరికి సాధ్యముకాదు. స్వయముగా నీవే వెళ్ళ వలసినదే, నేను దేవేంద్రుఁడు ఆ యక్షుని సమీపించుసరికి అతని తేజస్సు వల్ల మా కన్నులు మూసుకొనెను. అంతలో యక్షుఁడు అంతర్ధానమయ్యెను దేవేంద్రునికి ఈ కార్యము భగవంతునికి కాక వేరేవారికి సాధ్యము కాదు అని భావము కలుఁగ జగన్మాతను ధ్యానించెను.దివ్య తేజస్సుతో జగన్మాత అవతరించెను. దేవేంద్రుఁడు జగన్మాతను స్తుతించి యక్షుని గురించి ప్రశ్నించెను. జగజ్జనని వత్సా యక్షుఁడు సామాన్యుఁడు కాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుఁడే. అతనిని గుర్తించ గలవారు ఈ ప్రపంచమందు లేరు. దుష్కృత్యములోనరించు వారికి ఆతఁడు  పరమ శత్రువు. రాక్షస సంహారమందు మీరు నిమిత్తమాత్రులు. నిజానికి వారిని సంహరించినది అతనే అతని అండ లేక మీరు కాలు కూడా కదపలేరు. అందు వలననే అగ్ని వాయు దేవులు  నిస్తేజులయ్యిరి. మేమే దానవులను సంహరించామని మీరు ఆహంకరించుతున్నారు. ఆ అహంకారము వలననే అగ్ని వాయువులు పరాజయము పొందిరి. ఆహంకారాసురుని జయించినచో మీరు నిజముగా దేవతలై పరాత్పరునికి ప్రీతిపాత్రులు కాగలరు అని అంతర్ధానమయ్యెను. జగన్మాత ఉపదేసమును దేవేంద్రుడు దేవతలకు చెప్పగా  వారి గర్వాహంకారములు వీడి విజయమును పొందిరి.
మనము కూడా అహంకారాసురుని జయించిననాడే విజయమును పొందగలమనేది నీతి. 
సమర్పణ. జి.కన్నయ్య.
చూచారు కదా! ఐతే శుభమస్తు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
అందరూ ఆచరించ వలసిన మంచి సూక్తిని అందించారు. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.