పూజ్య ఆంధ్రామృత పాఠకులారా! సుహృజ్జనులారా! నమస్తే.
ఆ జగన్మాత కటాక్షం వలన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఐన మా కోడలు స్త్రీ శిసువుకు జననమిచ్చింది. నేను తాతనయ్యాను. ఆ జగజ్జనని అవ్యాజానురాగానికి శత సహస్ర వందనములు.
తేదీ. 28 - 01 - 2011.
సమయం:- గం.10 - 48.ని..లు.
జనన స్థలము. వనస్థలి పురం.
నక్షత్రము:- అనూరాధ ద్వితీయ చరణము.
లగ్నము:- కన్య.
(నా అర్థాంగి విజయ లక్ష్మి జన్మ నక్షత్రము కూడా అనూరాధ. అంతా ఆమె పోలికే అని అంటూంటే , ఆమె, ఆమెతో పాటు మా అబ్బాయి కూడా ఆనందిస్తున్నారు. ఆ విషయం నాకూ ఆనందం కలిగించింది.)
నా విన్నపము:-
మా మనుమరాలుకు నామకరణం చేయడం కోసం మన సంప్రదాయ బద్ధమైన ఆలోచనలకనుగుణంగా ఆధునికుల ఆలోచనలకు తగినట్టు చక్కని పేరు ఏది పెట్టితే బాగుంటుందో మీ సూచనలను పరిగణించి, మా చిరంజీవులకు సూచించాలని నాకుంది.
దయచేసి సూచించ గలందులకు నా మనవి.
ఇట్లు,
భవదీయుఁడు,
చింతా రామ కృష్ణా రావు.
జైశ్రీరాం.
జైహింద్.
7 comments:
చిన్నారి తల్లికి ఆశీస్సులు. నానమ్మ పేరే పెట్టేయండి. అంతకన్నా మంచి పేరా?
అభినందనలండీ..చిన్నారికి ఆశీస్సులు.
మా అబ్బాయిది కూడా అనురాధా నక్షత్రమే..నూ తొ మొదలవ్వాలని చెప్పారు, కానీ తాత గారి పేరే పెట్టాము మేము కూడ...నానమ్మ గారి పేరుని మించిన పేరు ఏముంటుందీ...కొత్తగా కావాలంటే మాత్రం..నాకు నచ్చిన అమ్మాయిల పేర్లు...అనఘ,అనన్య, విరాళి, సిరి వెన్నెల, నూపుర,లాస్య, అమృత వర్షిణి...
చిన్నారికి దీవెనలు. ఇక్కడ చూడండి బోలెడు పేర్లు..
http://bachpan.com/
నమస్కారము,అభినందనలు
ఆయుషి (LOng LIVE) లేదా ఆహనా First rays of the sun) అని నామకరణము చెయ్యండి.
చిన్నారికి ఆశీస్సులు.
హరిణి నాకు నచ్చిన ఒక పేరు :)
!చాలా ఆనందంగా ఉంది తమ్ముడూ ! ఇంకేం ? కొత్త సంవత్సరం మొదటి నెల .మన ఇంట లక్ష్మీ దేవి నెలకొంది. అసలె బామ్మ గారి పేరు మామూలు కాదు " విజయ " లక్ష్మి అందు చేత మీ అందరి ఇష్టం పైగా సరస్వతీ పుత్రులు.ఆ వీణా పాణి చక్కటి పేరు చెబుతుంది. చిన్నారిని + మీ అందరిని ఆశీర్వ దించి అక్క
చిన్నారికి ఆశీస్సులు.
Rithwik
Sathwik నాకు నచ్చిన 2 పేరు :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.