గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2011, శనివారం

ధూర్తుల యొక్క లక్షణములు.ముఖం పద్మ దళా కారం.మేలిమిబంగారం మన సంస్కృతి 108.

శ్లోll
ముఖం పద్మ దళా కారం - వచశ్చందన శీతలం.
హృత్కర్తరి సమం చాzతి వినయం ధూర్త లక్షణం.
కll
సుందర ముఖ పద్మమ్ములు,
నందంబగు పలుకులందు నమృతపు జల్లుల్.,
డెందమ్ములు చుర కత్తులు,
ముందుగనతి వినయమొలయు మూర్ఖుఁలు ధూర్తుల్.
భావము:-
చక్కని ముఖ వైఖరి, చల్లని మెత్తని మాటలు, కత్తెర బోను వంటి హృదయము, అతి వినయము ఇవన్నియు ధూర్త లక్షణములు.
ఇట్టి ధూర్తుల విషయంలో మిక్కిలి జాగరూకతతో మనం ప్రవర్తించాలి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

6 comments:

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

మరి చక్కని ముఖవర్చస్సు కల వారంతా ధూర్తులా?
మరియు కత్తెరబోనువంటి హృదయం కలవారిని ఎలా పోల్చుకోవటం

astrojoyd చెప్పారు...

@రహ్మానుద్దీన్ షేక్-అభ్యాసం కూసువిద్య..అనుభవం+అనుభవాలు మీరడిగిన సందేహాన్ని నివృత్తి చేయగలవు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రహమానుద్దీన్ సోదర!
సహజంబుగ మేడి పండు చక్కగ నుండున్.
బహిరంతర్భేద మొదవు.
మహిపై గల మనుజులంత మాన్యులొ? చెపుడీ!

రూపము చూసి సద్గుణ నిరూపణ చేయగ నౌనె? యిద్ధరన్
రూపరు లెల్ల శిష్టులు కురూపులు దుష్టు లనంగ చెల్లునే.
రూపము, మాటలందు సురూపముగా కనిపింపఁ జేసి,వా
గ్రూపము చూపి నమ్మునటు కుత్సితు లుండుట గాంచలేదొకో?

బాహ్య సౌందర్యం చూసి మోసపోవద్దన్నదే కవి అభిప్రాయము. మంచి మాటలు పైకి మాటాడుచూ మంచిగా వ్యవహారం నడిపి తుదకు లెక్కకు మిక్కిలిగా కనాన్ని మోసపుచ్చుతున్న దుర్జనులు కూడా పైకి అందంగానే ఉండ వచ్చు. ఇది అనుభవైక వేద్యమే.
మీ అభిప్రాయ వ్యక్తీకరణకు సంతసించి, మీకు ధన్యవాదములు తెలియ జేసుకొను చున్నాను.

కథా మంజరి చెప్పారు...

మీ పద్య రచన ఎంత ఆహ్లాదకరంగానో సాగుతూ ఉన్నది.ఇటీలవలి కాలంలో పద్యాన్ని ఇంత ఒడుపుగా వ్రస్తున్న వారే కరువయ్యారు. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజమె " అతివినయం ధూర్త లక్షణం " అన్నారు. అందరు అలా అనికాకపోవచ్చును .కాని కొందరి ముఖ కవళికలను బట్టి [ అదె ఫేస్ రీడింగ్ ] ఇది వీరు తెచ్చి బెట్టుకున్నదా ? నిజం గానా ? [ నటనా ? ] అన్న సంగతి కొంత వరకు తెలుసు కోవచ్చును. ఎంతైనా నిజం నిజమె నటన నటనె రెండిటికీ " నింగీ ....నేలా " చింతా వారి సూక్తులు అమృత గుళికలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.