ఆంధ్రామృత పాన లోలులారా! మకర సంక్రాంతి అనంత కాంతులు మీకు ప్రసాదించినట్టుగా భావిస్తున్నాను. ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొన్న మీకందరికీ నా అభినందనలు.
శ్రీమదధ్యాత్మ రామాయణ కర్త శ్రీ మాన్ పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారిని గూర్చి మనంఅనేకమార్లు మన ఆంధ్రామృతంలో ప్రస్తావించుకొన్నాం కదా! ఆ మహనీయుని అనువాదమైన శ్రీమదధ్యాత్మ రామాయణం ఆవిష్కరణ సందర్భంగా వారికి సభికులు సమర్పించిన ప్రశంసా పత్రములనిది వరకు చూచాము. ఇప్పుడు వారి గ్రంథావిష్కరణకు సంబంధించిన చిత్తరువులను విపులంగా ఈ క్రింది పికాసా వెబ్సైటులో చూడ గలందులకు మనవి చేయు చున్నాను.
http://picasaweb.google.com/మీ కొక శుభవార్త.
వారు ఆంధ్రీకరించిన శ్రీమదధ్యాత్మ రామాయణం కావలసిన వారు తమ చిఱునామాలను పంపగలరు.ఈమెయిల్ ఎడ్రస్సు కూడా పంపగలరు.
ఇప్పుడు వారి రచన లోని ఒక చిన్న అమృత గుళికను చూపిస్తాను రుచి చూడండి.
శ్రీమదధ్యాత్మ రామాయణము బాలకాండ ద్వితీయ సర్గలో
రాక్షస సంహారార్థము అవతరించ వలసినదని శ్రీమన్మహావిష్ణువును ప్రార్థించుటకై వచ్చిన వారు శ్రీహరిని చూచిరి. బ్రహ్మ ఆ హరిని కీర్తించిన సందర్భములోనున్న 20వ పద్యము.
పంచ చామరము.
సహస్ర శీర్ష శోభితాయ సత్య మూర్తయే నమః.
సహస్ర దివ్య లోచనాయ జ్ఞాన మూర్తయే నమః.
సహస్ర పాద పంకజాయసౌఖ్యదాయతే నమః.
సహస్ర దివ్య నామ రూప సంధృతాయతే నమః.
చూచారుగా ఎంత అద్భుతంగా ఉందో. గ్రంథము ఆద్యంతమూ ఇంత అద్భుతంగానూ ఉందంటే అది చదివిన వారికే నమ్మబుద్ధి పుట్టే నగ్న సత్యం.
నమస్తే.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post
2 comments:
నేమానివారి పంచచామరపద్యం చాల బాగుందండీ. తేలికగా అర్థమయ్యేలా వ్రాయటం కూడా ఒక కళే.
నమస్కారములు
శ్రీమదద్యాత్మ రామాయణ కర్త " శ్రీమాన్ పండిత నేమాని " రామ జోగి సన్యాసి రావు గారి గ్రంధావిష్కిరణ చిత్తరువులు " ఆది దంపతులవలె శోభాయ మానంగా కన్నుల విందు చేస్తున్నాయి." పాటలు పాడి మాలాలంకృతులను చేసి పాదాభి వందనం చేయ గలిగిన వారందరు అదృష్ట వంతులు.అవి నెట్ లొ నైనా చూడగలిగె అదృష్టం మాకు కలిగించిన చింతా వారు ధన్యులు. శ్రీ నేమాని దంపతులకు పాదాభి వందనములు.చింతా వారి కృషికి అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.