మహిమోపేత ధరాతలంబునను సన్మాన్యుల్, జగద్వందితుల్,
బహు సత్కార్య సుసాధనా ప్రతిభులున్, భక్తిప్రపత్తిస్థిరుల్,
మహనీయుల్ గలరిద్ధరన్. మదిని సంభావింతు నవ్వారలన్
రహిఁ గాంచున్ గద వారలీ మహిత సంక్రాంతిన్ మహద్భాగ్యులై.
ఆ మహనీయు లెవరో కాదు.
మీరే.
ఆంధ్రామృత పాన లోలురైన మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను.
ఈ మంచి సమయంలో శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి కవి శ్రేష్టుల సర్వలఘు సీసము... కాదు కాదు సర్వలఘువులతో నొప్పారు చున్న పరమార్థ రహస్యామృతమును మీ కందించు చున్నందుకు ఆనందంగా ఉంది.
ఆ కవీశ్వరులకు నా ధన్యవాదములు.
లోకాఃస్సమస్తాస్సుఖినో భవంతు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post
10 comments:
చింతా రామకృష్ణారావు గారూ!
మీకు మా సంక్రాంతి శుభాకాంక్షలు.
సర్వ లఘు సీస పద్యము గొప్పగా ఉన్నది, ధన్యవాదాలు.
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.మీ పద్యము చాలా బాగుంది.
తెలుగు సంస్కృతికి అద్దంపట్టే సంక్రాంతికి అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, ఈ రోజునే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతున్న సందర్భంగా మనందరి ఆలోచనల్లో సరికొత్త క్రాంతి్రేఖలు విచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను... ఈ సందర్భంగా మీకూ మీ కుటుంబ సభ్యులకూ శుభాకాంక్షలు....
--పిఆర్ తమిరి
మీకు.. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు , శ్రేయోభిలాషులకు.. సంక్రాతి పండుగ శుభాకాంక్షలు
సర్వ లఘువుల తో సీస పద్యాన్ని వ్రాసిన కవి శ్రేష్టులకు ,అందించిన మీకు ప్రణామములు
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఉ:-
శ్రీ మహనీయవాగ్భువనశేఖర! శ్రీ శుభనామ! ధారణో
ద్ధామ! గుణాభిరామ! లలితాంధ్రమనోరమ! దివ్య గోపనా
రామసుధాకర! ద్విజవిరాజగజాననభద్ర! సస్యసు
క్షేమ మొనర్చు మీకు హరి,కేశవు,భద్రగణాదురెల్లరున్!
- మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ రవీంద్ర.
చక్కని చిత్రము అంతకు మించిన అందమైన " సర్వ లఘు సీసము " చాలా బాగున్నాయి అందరికి సంక్రాంతి శుభా కాంక్షలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.