సీll
నమకంబునందొప్పు, చమకంబునందొప్పు - నలినాక్షిపార్వతి కలలనొప్పు.
మోదక ప్రియుఁడుతా ముదమార కొలిచి, న - మఃశివాయన పొంగు మాన్యుఁ డతఁడు.
నారాయణుండు శివారాధనను జేయ - శిరమొంచి మున్నిల్చి క్షేమ మొసగు.
రాజ మౌళియె హరి చేతి - వాజి, కొలువ.
యముఁడినే యెదిరించి, ప్రి - యముగ నొక ప్ర
ణామమును చేయు భక్తులఁ - బ్రేమఁ గాచు.
యతుల కగుపించు హరియు స - ద్గతియు నతడె.
ఆర్యులారా!
ఈ పద్యము వివిధ పద గోపనము అనఁబడే చిత్రకవితారీతి కలిగి యున్నదని మీరు గ్రహించియే యుందురు.ధన్యోస్మి.
జైశ్రీరాం.
జైహింద్.
4 comments:
చాలా బాగుందండి. అభినందనలు.
చింతా వారికి లక్ష్మణుని నమస్సుమాంజలులు.
మీ బ్లాగు బహు బాగు,
మీ పద్యం తెలుగు భాష కు నైవెద్యం,
మీ శైలి సమున్నతం, భాష ఉన్నతి కి మీ సేవ సత్యం, ఆంధ్రుల ఆదరణ మీకు తధ్యం, తధ్యం.
నా బంతిపూల వాసన అప్పుదప్పుదూ పీల్చి, మీ అమూల్యాభిప్రాయాలను తెలుపగలరు.
ఆంధ్రామృత పాన లోలా! లక్ష్మణ కుమారా! మీ అమృతోపమానమైన వ్యాఖ్య నా ప్రయత్నానికి నూతనోత్తేజాన్ని సమకూరుస్తోంది. ధన్యవాదములు తెలియ జేసుకొను చున్నాను.
చాలా బాగుంది తమ్ముడు ! అభినందనలు.ఇలాగే ఇంకా ఇంకా ఎన్నో మరెన్నెన్నొ మాకందించాలని
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.