గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2011, శనివారం

ఓంనమశ్శివాయ అంటే ముందుగా నారాయణుడొచ్చాడేంటీ?

సీll
ఓంకార వేద్యుండు నోంకార పూజ్యుండు - (నోం)ఓంకార రూపుండు నోం ప్రవర్తి. 
మకంబునందొప్పు, చమకంబునందొప్పు - లినాక్షిపార్వతి కలలనొప్పు. 
మోదక ప్రియుఁడుతా ముదమార కొలిచి, న - మఃశివాయన పొంగు మాన్యుఁ డతఁడు.
నారాయణుండు శివారాధనను జేయ - శిరమొంచి మున్నిల్చి క్షేమ మొసగు.
రాజ మౌళియె హరి చేతి - వాజి, కొలువ.
ముఁడినే యెదిరించి, ప్రి - ముగ నొక ప్ర
ణామమును చేయు భక్తులఁ -  బ్రేమఁ గాచు.
తుల కగుపించు హరియు స - ద్గతియు నతడె.
ఆర్యులారా!
ఈ పద్యము వివిధ పద గోపనము అనఁబడే చిత్రకవితారీతి కలిగి యున్నదని మీరు గ్రహించియే యుందురు.ధన్యోస్మి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

4 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

చాలా బాగుందండి. అభినందనలు.

lakshmana kumar malladi చెప్పారు...

చింతా వారికి లక్ష్మణుని నమస్సుమాంజలులు.
మీ బ్లాగు బహు బాగు,
మీ పద్యం తెలుగు భాష కు నైవెద్యం,
మీ శైలి సమున్నతం, భాష ఉన్నతి కి మీ సేవ సత్యం, ఆంధ్రుల ఆదరణ మీకు తధ్యం, తధ్యం.

నా బంతిపూల వాసన అప్పుదప్పుదూ పీల్చి, మీ అమూల్యాభిప్రాయాలను తెలుపగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆంధ్రామృత పాన లోలా! లక్ష్మణ కుమారా! మీ అమృతోపమానమైన వ్యాఖ్య నా ప్రయత్నానికి నూతనోత్తేజాన్ని సమకూరుస్తోంది. ధన్యవాదములు తెలియ జేసుకొను చున్నాను.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చాలా బాగుంది తమ్ముడు ! అభినందనలు.ఇలాగే ఇంకా ఇంకా ఎన్నో మరెన్నెన్నొ మాకందించాలని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.