శ్లోll
భీతేభ్యశ్చాzభయం దేయం. వ్యాధితేభ్యస్తధౌషధం.
దేయా విద్యార్థినాం విద్యా. దేయమన్నం క్షుధార్తినాం.
గీll
భీతిగొనువారికభయంబు ప్రీతి నిడుము.
రోగికౌషధమొసగుము బాగు చేయ;
చదువుకొనఁ గోరువారికి చదువు చెపుము!
ఆకలన్నట్టివారలకన్న మిడుము.
భావము:-
భయము చెందిన వానికి అభయ దానము; రోగ పీడితులకు ఔషధ దానము; విద్యార్థులకు విద్యా దానము; ఆకొన్న వానికి అన్న దానము చేయుట ఉచితమైన పని.
జైహింద్.
Print this post
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుఁగు విశ్వవిద్యాలయం వారిచే అవధానరంగమున
పురస్కారం అందుకొనుచున్న సందర్భముగా అభినందన పంచరత్నావళి. తే. 26 - 9 - 2026.
-
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీరస్తు .. శుభమస్తు .. అవిఘ్నమస్తు.
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అవధాని మహోదయులకు
తెలుఁగు విశ్వవిద్యాలయకులపతి చే ప్రతిభాపురస్కారమునంద...
2 వారాల క్రితం
వ్రాసినది



2 comments:
అభినందనలు
ఇంత మంచి ఆణి ముత్యాలను అనునిత్యం అందిస్తున్న మీ ఔన్నత్యానికి ఎలా అభినందించినా తక్కువె మరి ఇంకా ఎన్నొ ఎన్నెన్నో అమృత ధారలు తమ కలం నుంచి జాలు వారాలని
మంచైనా సరే ఇంత స్ట్రైట్ గా చెబితే తలకాయల్లోకి ఎక్కదండీ. కాస్త మసాలా పులమాల్సిందే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.