జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసృజించేటప్పుడు ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య
అంటారు. మరెలా తీయాలో ఆలోచించండి.
-
నూతన యజ్ఞోపధారణానంతరము జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసృజించేటప్పుడు ఎగదీస్తే
బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అంటారు.
"ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితమ్,
విసృ...
4 రోజుల క్రితం
వ్రాసినది



4 comments:
చెప్పగ నిది విప రీతము
కప్పను తిన్నట్టి పాము కనలే దెచటన్
ఒప్పగు నిది కలి కాలము
తప్పదు మరి తారు మారు తథ్యము సుమ్మీ
తప్పనుట తగదు కలిలో
కప్పలు కుప్పలుగ జేరి కావరమొప్పన్
గొప్పగు కులసంపదగల
కప్పయె తా మ్రింగె పాము ఘనతను చాటన్
వల్లభ వఝల అప్పలనరసింహమూర్తి
జుత్తాడ
కప్పను మింగిన పామును
చెప్పగ నే చూచి చూచి చిన్నతనానన్
యిప్పుడు చూచిన చిత్రము
కప్పయె మ్రింగుట పామును కలిమహిమౌనే ?
తమ్ముడు ! కోప్పడకేం ? చూడగానే రాయాలనిపించింది." అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు. " అదన్న మాట అసలు సంగతి "
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.