గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2010, శనివారం

(ఆంధ్ర) ప్రథానోపాధ్యాయులు డా.మెఱుగుమిల్లి కి CMRపురస్కారం.

(ఫొటోలపై క్లిక్ చేసి చూడండి)

CMR Pratibha Awards, instituted by CMR Charitable Trust, were presented to school and district toppers from Visakhapatnam, Srikakulam, Vizainagaram. Union minister of State for Human Resources Development, D.Purandeswari, Who was the Chief guest, underlined the role of teachers in moulding students into good citizens. Minister for school Education Manikya Vara Prasada Rao, Minister for Tribal Welfare P.Balaraju, CMR group chairman Mavuri Venkata Ramana, District Collector J.Syamala Rao, Visakhapatnam Port Trust Chairman Ajeya Kallam and GVMC Commissioner V.N.Vishnu are other honorable guests on this occasion.
Dr' Merugumilli Venkateswara Rao Received Award  on 24-07-2010, Saturday.

శ్రీయుత పాఠకులారా!
విశాఖపట్టణం జిల్లా లోని మునగపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథానోపాధ్యాయులు
( ఇంతకు ముందు  ప్రథమాంధ్రోపాధ్యాయులు) ; విశాఖపట్టణం జిల్లా పద్య కవితా సదస్సు కార్య దర్శి ఐన  డా. మెఱుగుమిల్లి వేంకటేశ్వర రావు గారికి ప్రతిష్ఠాత్మకమైన CMR పురస్కారాన్ని కేంద్ర మత్రి శ్రీమతి డీ. పురందేశ్వరి అంద జేసారు.
ఉత్తములైన ఉపాధ్యాయులు సమాజంలో తప్పక గుర్తింపఁబడి గౌరవింపఁబడతారనడానికి ఈ సన్నివేశమే మనకు ప్రమాణము. 
శ్రీ వేంకటేశ్వర రావు చక్కని ఉపాధ్యాయులే కాదు; మంచి ఆర్ద్రత కల చక్కని కవి అని అనే కంటే  ఆశుకవి అనడమే సముచితంగా ఉంటుంది.
వీరు ప్రథమాంధ్రోపాధ్యాయులుగా ఉన్నప్పుడు అనకా పల్లి సమీపందు కల సీతా నగరంలో హైస్కూలు బాల బాలికలచేత అష్టావధానం చేయించారు.
విద్యార్థులలో అంతర్గతంగా ఉండే అనంత శక్తిని బైటకు తీయ గలిగిన వాడే ఉత్తమ ఉపాధ్యాయుడు అని మనం అనుకుంటే మాత్రం ఇతడు నూటికి నూరుపాళ్ళూ ఉత్తమ ఉపాధ్యాయుఁడే.
CMRపురస్కారం వీరందుకోవడమే ఆ విషయాన్ని రుజువు చేస్తోంది.
మహాత్ములు పరమాత్మ కృప గలిగి గౌరవింపఁ బడుదురు గాక! 
ఈ సందర్భంగా డా.వేంకటేశ్వర రావు గారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియఁ జేస్తోంది.
జైశ్రీరామ్.
జైహింద్.  
Print this post

3 comments:

రవి చెప్పారు...

బొమ్మలు కనిపించట్లేదండి.

రవి చెప్పారు...

ఇప్పుడు సరిపోయింది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

CMR. పురస్కార గ్రహీతలు ఉత్తమ ప్రధమోపాధ్యాయులు ,మంచి కవి ,అన్నిటిని మించి " హై స్కూల్ విధ్యార్ధుల చేత అవధానం చేయించ గలిగిన నిపుణులు," డా.శ్రీ మెఱుగుమిల్లి వెంకటేశ్వరరావు గారిని పరిచయం చేసి నందుకు చాలా ఆనందం గా ఉంది.పురస్కార చిత్రములతొ పేరెన్నిక గన్న వారిని పదుగురికి పరిచయం చేయ గల సహృదయత చింతా వారి కృషి అభినంద నీయము .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.