గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2010, సోమవారం

చాలా ఆశ్చర్యకరంగా నిజమైన శ్రీ వల్లభవజ్ఝల వారు చెప్పిన జ్యోతిష్యం.

ప్రియ పాఠకులారా! 
ఈ రోజు మీకు ఒక నమ్మ లేని నిజాన్ని నేను చెప్ప బోతున్నాను. అదేంటంటారా! ఖంగారు పడకండి; చెప్తాను.
ఈ పై చిత్రంలో మీరు చూస్తున్న; సన్మానింప బడుతున్న వ్యక్తి అతి సామాన్యంగా అందరికీ కనిపించే గొప్ప మేధావి. వీరి పేరు శ్రీ వల్లభవజ్ఝల నరసింహ మూర్తి. రిటైర్డ్ టీచరు. వీరి నివాసం విశాఖ పట్టణం జిల్లా; చోడవరం మండలం; జుత్తాడ అనే ఒక పక్కా పల్లెటూరు. ప్రస్తుతం వీరు తమ గ్రామంలో గల నిరు పేద శివాలయంలో అర్చనలు భక్తుల కొఱకు చేస్తూ ఆ ప్రజాసేవలో పునీత జీవితం గడుపుతున్న పవిత్ర మూర్తి. అంతే కాదు వీరు సామాన్యులుగా పైకి కనిపించే అసామాన్యులు. మంచి కవి. అలవోకగా ఆశువుగా పద్యం చెప్పగల దిట్ట. అనేక శతకాలు వ్రాసి ఆ పుట్టపర్తి సాయిబాబాయొక్క ప్రశంసలే అందుకొనిన మహా మనీషి.
ఇంత వరకూ ఇదంతా అందరి దృష్టిలోను సామాన్య విషయమే  ఐ ఉండ వచ్చు.
అసలు ప్రత్యేకమైన విషయం నేను చెప్ప దలచుకొన్నది చెప్పుతున్నాను వినండి. 
వీరు నాకు సాహితీ మిత్రులు. నాపై గల అవ్యాజమైన ప్రేమతో చోడవరంలో మాయింటికి తరచూ వస్తూ ఉండేవారు. ఏవో సాహిత్య పరమైన చర్చ మా మధ్య సాగుతూ ఉండేది. ప్రసంగ వశాత్తు మా అబ్బాయికి (ఇప్పుడు కాదు; ముందటేడు సుమండీ)వివాహ ప్రయత్నంలో మేము ఉన్న సంగతి గ్రహించిన శ్రీ వల్లభవజ్ఝల నరసింహ మూర్తి గారు మా అబ్బాయి పుట్టిన తేదీ; పుట్టిన ప్రదేశము అడిగి తీసుకొని; అక్కడే  కూర్చొని; ఒక్క పది నిమిషాల సేపు ఏవో లెక్ఖలు వేసి; మా అబ్బాయి దశను; అంతర్దశను చూచి; ఈ మీ అబ్బాయికి 2009 అక్టోబరు 28 వ తేదీన వివాహమౌతుందని ఆలెక్ఖ కట్టిన కాగితం మీదే వ్రాసి నాకు ఆవిషయాన్ని చెప్పారు. ఐతే వారి మాటలు విన్న నేను  ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకో లేదు.
ఏవో సంబంధాలు వచ్చేవి; ఏదో కారణంగా తప్పేవి.
మేమైతే ఆ సంవత్సరం ఈ వివాహ ప్రయత్నం విరమిద్దామనే నిర్ణయానికి వచ్చేసాము. నేను రిటైరైపోయిన కారణంగా మా అబ్బాయి దగ్గరకి హైదరాబాదుకు మకాం మార్చాము. ఐతే  మూడు సంవత్సరాల క్రితమే వచ్చిన  సంబంధమే మేం హైదరాబాదు వచ్చినట్టుగా తెలుసుకొని మాయింటికి వచ్చి;   మేమిదివరకు రమ్మన్నాం. మీరు దూరంగా ఉన్న కారణంగా రాలేకపోయారు. ఇప్పుడు మీరున్న యింటికి దగ్గరే మాయిల్లు. మీతో సంబంధం కలుపుకోదలిచాం. తప్పక మాయింటికి వచ్చి చూడండి అని ఒక పెళ్ళివారు ఆహ్వానించారు. సరే ఇంటికొచ్చి పిలిచారు. వెళ్ళడం మర్యాద. అనుకొని వెళ్ళాము. ఆ దైవ సంకల్పం కారణంగా ఆ సంబంధం ఖాయ పడింది.  కొన్ని ఆటంకాలేవో అడ్డొస్తాయనే కారణంగా  సెప్టెంబరు నెలలో మానివేసి తేదీ 01-11-2009 ని వివాహం చేద్దామని నిర్ణయించాము.
ఐతే కొందరు సిద్ధాంతులు ఏవో సరిగా నప్ప లేదంటూ 
30-10-2009 కి మార్చారు. మా తమ్ముడు ఆముహూర్తం చూసి అంతకంటే 28-10-2009. చాలా బాగుందని చెప్పడంతో అదే ఖాయ పరచక తప్ప లేదు. ఆ దైవ కృప వల్ల  28-10-2009 వ తేదీనే అనుకున్న విధంగా జరిగింది..
ఇక్కడే మీకు నేను చెప్పదలచుకొన్న విషయం ఉంది.
నిన్నను ఏ దో కాగితం కోసం పుస్తకాలు తిరగేస్తూ ఉంటే నా మిత్రులు శ్రీ వల్లభవజ్ఝల నరసింహమూర్తిగారు స్వయముగా వ్రాసి చోడవరంలో నాకిచ్చిన కాగితం కనిపించింది. అది చదివాను. ఇంకేముంది వారు ఏ తేదీనైతే వివాహం మా అబ్బాయికి ఔతుందని వ్రాసేరో సరిగ్గా అదే తేదీన జరిగిందనే విషయం ఇప్పుడు గ్రహించి చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను.
ఆ కాగితాన్ని నేనిప్పుడు గుర్తించి భద్రపరిచాను.
చూచారా! ఎంత వింతో? అతి సామాన్యంగా కనిపించే శ్రీ వఝల నరసింహ మూర్తిగారు చెప్పిన తేదీకే వివాహం జరగడం నిజంగా చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందిప్పటికీ కూడా. 
నే నెంత ప్రయత్నించి 01-11-2009 వ తేదీని జరిపిద్దా మనుకున్నా గాని; రక రకాలుగా తిరిగి తిరిగి ఏ ముహూర్తాన వివాహమౌతుందని శ్రీ వల్లభవజ్ఝల నరసింహమూర్తిగారు కాగితంపై వ్రాసి యిచ్చారో ఆ తేదీకే ఖాయమై; జరిగింది. అది మేం భయపడిన ఆటంకం తేదీ . ఐనా కాని ఏ ఆటంకమూ లేకుండా చాలా హృదయాహ్లాదకరంగా జరిగింది. 
ఏంటండీ వింత? ఆ సిద్ధాంతి గారు కళ్ళతో జరగబోయేది చూసినట్టు ఎలా వ్రాయ గలిగారు? ఇప్పటికీ నాకు దీని అంతు చిక్కటం లేదు. వారికి ఫోన్ చేసి విషయం చెప్పితే ఆ దైవం వ్రాసిందే  నేను లెక్ఖ కట్టి చెప్పాను. అదే జరగడంలో ఆశ్చర్యమేముంది? అంటూ ఇది సర్వ  సామాన్యమే అన్నట్టుగా మాటాడారు.
కొందరు జాతకాలు లేవు; అన్నీ మన మూఢనమ్మకమే అంటూంటారు. నేనైతే పెద్దగా పట్టించుకోను. ఐనా చెప్పింది చెప్పినట్టూ మన నిర్ణయాన్ని కూడా మార్చేసి జరగడంలో గల కారణం ఏంటంటారు?
మీరు నమ్మరా? నమ్మ మని నేనెప్పుడూ ఎవరికీ చెప్పను. ఐతే జరిగిన యదార్థాన్ని చెప్పడానికి కూడా వెనుకాడను. అందుకే ఈ విషయం చెప్పాను.
మీకు ఈ మహనీయునితో మాటాడాలని ఉంటే  ఈ టపాలో వ్యాఖ్య ద్వారా తెలియ జేస్తే మీకు వారి వివరములు తెలియ జేయగలను.
నమస్తే.
జైహింద్. 
Print this post

11 comments:

రవి చెప్పారు...

బావుంది.

తేదీలతో సహా ఆయన చెప్పిన విషయం కాకతాళీయం అని శంకించే పనే లేదు. ఏది ఏమైనా జ్యోతిష్యం ఒక శాస్త్రం, వేదాంగం. వేల యేళ్ళ శాస్త్రం, ఎవరో నాస్తిక ముద్ర ధరించి, అదే విజ్ఞానం అని మురిసిపోయే వాళ్ళు వాగినంత మాత్రాన అబద్ధం అవదు.

సురేష్ బాబు చెప్పారు...

చింతా గారు! మీరు వారి ఫోన్ నంబరు బ్లాగులో పెట్టడం వలన వారికి ఎంతమంది ఫోన్ చేసి ఇబ్బంది పెడతారో కదా! పాపం వారికి ఈ వయసులో కష్టం కావచ్చేమో!

రాఘవ చెప్పారు...

వజ్ఝలవారికి నమోవాకం.

జ్యోతి చెప్పారు...

నేను నమ్ముతానండి. ఇలా అనుకోనిది జరిగింది నా విషయంలోనే. ఐదేళ్లక్రింద నా జాతక విశేషాలు చదివి .. ఇది అబద్ధం.నా విషయంలో జరగడం అసంభవం అని అది పక్కన పడేసాను. కాని గత రెండేళ్లుగా నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ నా జాతకంలో ఉన్నవే... అసంభవం, అసాధ్యం అని పట్టించుకోని విషయాలు నాముందు సాక్షాత్కరిస్తుంటే ఏమనగలను??

కథా మంజరి చెప్పారు...

ఇలా జరగడాన్ని కొందరు మామూలే అని కొట్టి పారేసినా, ఎందుకు జరుగుతాయో చెప్పలేం.
మా మరదళ్ళు ఇద్దరి విషయంలో ఇలాగే జరిగింది. వాళ్ళిద్దరి జాతకాలూ చూసిన ఒకాయన, ముందుగా చిన్నమ్మాయి పెళ్ళి జరిగాక, తర్వాత పెద్దమ్మాయి పెళి్ళ జరుగుతుందని నాతో చెప్పారు. నేను ఆ విషయాన్ని అంతగా పట్టించుకో లేదు. ఇది జరిగిన నాలుగేళ్ళకి వారిద్దరి వివాహాలూ ఒక్క సారే కుదిరాయి. పెద్దమ్మాయి రైల్వే ఉద్యోగి కనుక, ఆమె పెళ్ళి రైల్వే కళ్యాణ మండపంలో చేయాలనుకున్నాము.ముహూర్తాలు పెట్టుకున్నాము. పెద్దమ్మాయి పెళ్ళికీ, చిన్నమ్మాయి పెళ్ళికీ సరిగ్గా పది రోజుల వ్యవధి ఉంది. కాని కళ్యాణ మండపాలు దొరకడంలో ఏర్పడిన ఇబ్బందుల వలన మేం ఎంత కాదనుకున్నా, ముందుగా చిన్నమ్మాయి పెళ్ళి, ఆ తర్వాత పది రోజులకి పెద్దమ్మాయి పెళ్ళి జరిగాయి. బాగా ఏ ఆటంకమూ లేకుండా జరిగాయి. వాళ్ళిప్పుడు పిల్లా పాపలతో హాయిగా ఉన్నారనుకోండి.
అయితే, జాతకాలను నమ్మాలా వద్దా?
ఆ సంగతి అలా ఉంచితే ఇలాంటివి చెప్పుకోడానికి తమాషాగా ఉంటాయి.

అజ్ఞాత చెప్పారు...

అయ్యా,
నా మిత్రులకి నేను ఎమైనా అంటె జరుగుతుందనిఒక నమ్మకం. ఇంజనీరింగ్ చదువుకొనే రోజులలో వారు నాతో ఇది చాలా సార్లు చెప్పారు. అంతె కాకుండా పరిక్షలప్పుడు నా దగ్గర కొచ్చి పెన్ను తీసుకేళ్లె వారు ఎందుకంటె నా చేతి ద్వారా తీసుకొంటె వారికి బాగ రాస్తామని నమ్మకం. వారి నమ్మకం చూసి నాకు ఎమనాలో తెలిసెది కాదు. ఇటువంటి నమ్మకాలతో పోలిస్తె నాకు జ్యొతిష్కం అంతో ఇంతో ఉత్తమం అని అనిపిస్తుంది. దానిలో ఒక శాస్త్రియ పద్దతి ద్వారా లెక్క కట్టి మనకు భవిషత్ చెపుతారు కదా! ఎంత లేదన్నా అది నిజమవటానికి 50:50 అవకాశం ఉంది.

durgeswara చెప్పారు...

సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనేది సత్యం . ఆ సూర్యోదయం ఒకసారి ఐదున్నర తరువాత జరిగితే మరొకసారి ఆరు దాటాక జరుగుతుంది . ఈవిషయాన్ని పరిశీలించినవాడు ఖగోళశాస్త్రవేత్త. ఇంకా లోతుగా సూక్ష్మాంశాలు పరిశిలించేవాడు జ్యోతిషశాస్త్రవేత్త . ఇవి మనం నమ్మినా నమ్మకున్నా ప్రకృతిరహస్యాలు ధర్మాలు. వివేకానందులన్నట్లుగా ,రెండవతరగతి పిల్లవాడు మిఠాయి ఇవ్వని ఖగోళశాస్త్రం దండుగ .ఉత్తి అబద్దం ,అని ఆరోపించినంత మాత్రాన అది ఆపిల్లవాని అమాయకత్వం మాత్రమే . ఇవి ఎవరు నమ్మకున్నా నమ్మినా సత్యాలు .ఇటువంటి మాహావిద్యలను అనుగ్రహించిన మహర్షిగణములకు చేతులెక్కిమొక్కుతున్నాను. ఉపయోగంచుకుంటే మానవాళికి శ్రేయస్సు చేకూరుస్తుంది ,ఉపయోగించుకోనని భీశ్మించినంతమాత్రాన ఆ విద్యల ఔన్నత్యానికి ఏమీ భంగం లేదు. ఆమహర్షి పరంపరలో సాగుతున్న ఈదివ్యవిద్యలను కాపాడుకొస్తున్న వారందరికీ ముఖ్యంగా వీరికి నా నమస్కారాలు తెలియజేయండి .ధన్యవాదమలు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బగా చెప్పావు తమండూ ! మేము ఖచ్చితంగా నమ్ముతాము. మాకు ఇప్పడి వరకు ఒక వ్యక్తి చెప్పినవి చెప్పినట్టుగా జరుగు తున్నాయి ఏదో ఒకటీ అరా తప్ప ఇవన్నీ ఏనాడు చెప్పినవో .వృధాపోవు . మంచి విషయం చెప్పావు

vsrao5- చెప్పారు...

srivajjula mastaru garki aneka namaskaramulu

అజ్ఞాత చెప్పారు...

Sir,I know the person shown in the photo. But his surname is not vajhala. It is Vallbhavajhula and his name is Vallabhavajhala Appala Narasimha Murthy.
K.Sreenivasa Rao

లక్ష్మీపతి చెప్పారు...

నేనూ నమ్ముతానండీ. వారిని ఎలా కాంటాక్ట్ చెయ్యాలో చెప్తారా, మా అమ్మాయి జాతకం చూపించాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.