సాహితీ ప్రియులారా!
విజ్ఞాన తేజో మూర్తులైన గురువులు తల్లి దండ్రులతో పాటు పూజనీయులు. విజ్ఞాన జ్యోతులను మనలో వెలిగించు అట్టి గురువుల ఋణం మన మేవిధముగనూ తీర్చుకొన జాలము. అట్టి వారికి హృదయ పూర్వకముగా నమస్కరించుటయే మనము చేయ గలిగినది. కావున మా గురు దేవుల నుద్దేసించి నక్షత్రబంధ కందములో వినమ్రతతో నమస్కరించు చున్నాను.
పరిశీలింప మనవి.
పై పటమున వేవురి లో వు(vu)అనునది మరుగునకు పోయినందున గుర్తింప మనవి.
పై పటమున ఎడమవైపున పైనుండి క్రాసుగా చదువ వలసి యున్నది.
నక్షత్ర బంధ కందము.
గురువన దయ యన దగు. వే
వురి భాగ్య మునీశులు! గురువుకు సమ భావం
బురు దయ యలరుద్యోగము
న రహి మునుగ వెలయ సకలునకు వందనముల్.
భావముః-
గురువును దయా స్వరూపముగా చెప్ప వచ్చును. వారు అనేకులకు భాగ్య కారణమైన మునీశ్వరులు. గురువు అనే వారికి అందరి యెడా సమాన భావము; గొప్ప దయ ఒప్పు చుండును. నేను చేసెడి సద్రచనోద్యోగమున వేగము ముందుగా వెలయు నిమిత్తము సకలము తానే ఐన గురువుకు నమస్కరింతును.
కోణాగ్రములందు > " గురువులకు " అనియు;
కూడలులయందు > " వందనములు " అనియు వచ్చినవి.
మీరిస్తున్న ప్రోత్సాహమే నాచే ఈ బంధ కవిత్వమును చేయించ గలుగుచున్నందుకు మీ కునా కృతజ్ఞతలు.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post
MUSIC CLASSES || Music Classes - Antha Ramamayam - P9 || Sangeetha Kala
-
జైశ్రీరామ్.
జైహింద్.
4 రోజుల క్రితం
3 comments:
గురువు గారండి,
ఒక్కో బంధంలో ఏయే అక్షరాలు ఆవృత్తి కావాలి, ఏయే ఛందస్సులో వ్రాయాలి అన్న వివరాలు తెలిపితే ఇంకా ఉపయుక్తం అవుతుంది కదా.
అద్భుతం...
శుభమస్తు.
తారా పధం లో గురువు యొక్క ఔన్నత్యాన్ని చెప్పినందుకు చాలా సంతొషం గా ఉంది " గురువు " దైవం కన్న గొప్పవాడు ఎందు కంటే " ఇతడు దేముడు " అని చెప్పిన వాడు గురువే గనుక. " ఈ బంధ కవిత్వము మంచి అనుబంధాన్ని పెంచు తోంది . మరిన్ని రాయాలని కోరుతూ ! అక్క
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.