గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జులై 2010, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 97.

శ్లోll
సహసా విదధీత నక్రియాం.అవివేకః పరమాపదాం పదం
వృణుతేహి విమృశ్య కారిణం గుణ లుబ్థాః స్వయమేవ సంపదః
కll
తొందర పడి యే పనియును
మందుని వలె చేయ తగదు. మహదాపద యౌన్.
ముందుగ నౌగాములరయు
సుందరుఁ గని చేరు లక్ష్మి శోభిలఁ జేయన్
భావము:-
ఏ పనినీ తొందర పడి చేయ కూడదు. తొందరపాటు; అవివేకము; అన్ని ఆపదలకూ మూలము. సవిమర్శముగా ఔ గాములాలోచించి పని చేయు వానిని గుణ లుద్థయై లక్ష్మి స్వయముగానే కోరి వరించును కదా!
జైహింద్. Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

హమ్మయ్య వారం రోజుల తర్వాత మేలిమి బంగారం దొరికింది అమ్మవారి చిత్రం బహు రమ్యంగా ఉంది
మంచి సూక్తి చెప్పి మమ్ములను మంత్రించి
యశము పొంది తీవు యిలను గాన
నీదు కీర్తి యిటుల నిఖిలమై జగతంత
వెలయు చుండు గాక వసుధ నిండ

తమ్ముడు ! రాయడం నేర్చు కుంటున్నాను తప్పులున్నాయా ?

Bhãskar Rãmarãju చెప్పారు...

మాష్టారూ
నమస్కారాలు
చాలా చక్కటి మాట చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.