గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జూన్ 2019, శనివారం

ఓంకారంబు గుణత్రయంబు

0 comments

జైశ్రీరామ్.
ఓంనమోనారాయణాయ
ఆర్యులకు శుభోదయమ్.

ఓంకారంబు గుణత్రయంబు కనగా ఓం శ్రీరమా వల్లభా!
ఓంకారంబు గమించు కాలగతియౌ నోంనారసింహప్రభూ!
ఓంకారంబు త్రిమూర్తి రూపమెకదా ఓంశ్రీ హరీ! పల్క నే
నోంకారంబె వినంబడున్ జగతిలోనోం పద్బనాభా! నమః.

జైశ్రీమన్నారాయణ
జైహింద్.

7, జూన్ 2019, శుక్రవారం

వేవరించు,వెనురాని,గర్భ"-స్పృహనా ద్వయ"-వృత్తము.రచన. శ్రీ వల్లభవఝల అప్పలనరసింహమూర్తికవి.

0 comments

జైశ్రీరామ్.
వేవరించు,వెనురాని,గర్భ"-స్పృహనా ద్వయ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-స్పృహనా ద్వయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.మ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముకలదు.వృ.సం.
1.వెంటరాని శ్రీ లవేలనో?వే వరీయజ్ఞాపి కెంచుమా!వేదింపౌ!తీరు మానుమా
కంటిరెప్ప కాచు దైవమై!కావగల్గు శ్రీధరుండులే!కాదంటే!దోషమే యగున్!
మింటి నంటు శంఖరావతన్!మీవశుండు మావశుండునై!మేథంనెంచున్ సుభూతినిన్!
జంటగూర్చు భుక్తి నీయుచున్!సావధాన పూర్ణ మేర్చుగా!సాధింపన్గల్గు మోక్షమున్!

2.వే వరీయ జ్ఞాపికెంచుమా!వెంటరాని శ్రీ లవేలనో?వేదింపౌ!తీరు మానుమా!
కావగల్గు శ్రీధరుండులే!కంటి రెప్ప కాచు దైవమై!కాదంటే!దోషమే!యగున్?
మీవశుండు మావశుండునై!మింటినంటు శంఖ రావతన్!మేథన్నెంచున్సు భూతినిన్!
సావధాన పూర్ణ మేర్చుగా!జంటగూర్చు భుక్తి నీయుచున్!సాధింన్గల్గు మోక్షమున్!
1.గర్భగత"-మత్తరజినీ ద్వయ"-వృత్తము
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171,
ప్రాసనియమముకలదు.
1.వెంటరాని శ్రీ లవేలనో?              
కంటి రెప్ప కాచు దైవమై!                
మింటినంటు శంఖరావతన్!          
జంటగూర్చు భుక్తి నీయుచున్!      
2. వే వరీయ జ్ఞాపి కెంచుమా!
కావగల్గు శ్రీ ధరుండు లే!
మీ వశుండు మావశుండునై!
సావధాన పూర్ణ మేర్చుగా!
2.గర్భగత"-చెడుతీర్పు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.ర.లగ.గణములు.వృ.సం.81,
ప్రాసనియమముకలదు.
వేదింపౌ!తీరు మానుమా!
కాదంటే!దోషమే యగున్!
మేథన్నెంచున్సు భూతినిన్!
సాధింపన్గల్గు మోక్షమున్?
3.గర్భగత"-రజినీకర ప్రియ ద్వయ-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
1.వెంటరాని శ్రీ లవేలనో?వే వరీయ జ్ఞాపికెంచుమా!
కంటిరెప్ప కాచు దైవమై!కావగల్గు శ్రీధరుండులే!
మింటినంటు శంఖ రావతన్!మీ వశుండు మా వశుండు నై!
జంట గూర్చు భుక్తి నీయుచున్!సావధాన పూర్ణ మేర్చుగా!

2.వే వరీయ జ్ఞాపికెంచుమా!వెంటరాని శ్రీ లవేలనో?
కావగల్గు శ్రీధరుండులే!కంటి రెప్ప కాచు దైవమై!
మీ వశుండు మా వశుండునై!మింటినంటు శంఖరావతన్!
సావధాన పూర్ణ మేర్చుగా!జంట గూర్చు భుక్తి నీయుచున్!
4."-రాజిర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.మ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వే వరీయ జ్ఞాపికెంచుమా!వేదింపౌ తీరు మానుమా!
కావగల్గు శ్రీధరుండులే!కాదంటే!దోషమే యగున్?
మీవశుండు మావశుండునై!మేథంనెంచున్సు భూతినిన్!
సావధాన పూర్ణ మేర్చుగా!సాధింపన్గల్గు మోక్షమున్!
5."-వేదింపుల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.మ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వే వరీయ జ్ఞాపికెంచుమా!వేధింపౌ!తీరుమానుమా!వెంటరాని శ్రీ లవేలనో?
కావగల్గు శ్రీధరుండులే!కాదంటే!దోషమేయగున్!కంటి రెప్ప కాచు దైవమై!
మీవశుండు మావశుండునై!మేథన్నెంచున్సుభూతినిన్!మింటినంటు శంఖ రావతన్!
సావధాన పూర్ణ మేర్చుగా!సాధింపన్గల్గు మోక్షమున్!జంటగూర్చు భుక్తి నీయుచున్!
6."-వేవరించు"-వృత్తము.
అత్యష్టీఛందము,మ.ర.య.జ.ర.లగ.గణములు.యతి.సంవ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం
వేదింపౌ!తీరు మానుమా!వెంటరాని శ్రీ లవేలనో?
కాదంటే!దోషమే యగున్!కంటిరెప్ప కాచు దైవమై!
మేథన్నెంచున్సుభూతినిన్!మింటినంటు శంఖ రావతన్!
సాధింపన్గల్గు మోక్షమున్!జంటగూర్చు భుక్తి నీయుచున్?
7."-వెనురాని"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.ర.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వేదింపౌ!తీరుమానుమా!వెంటరాని శ్రీలవేలనో?వే వరీయ జ్ఞాపికెంచుమా!
కాదంటే!దోషమేయగున్!కంటిరెప్ప కాచు దైవమై!కావగల్గు శ్రీధరుండులే?
మేథన్నెంచున్సుభూతినిన్ మింటినంటు శంఖరావతన్!మీవశుండు మా వశుండునై!
సాధింపన్గల్గు మోక్షమున్!జంటగూర్చు భుక్తి నీయుచున్!సావధాన పూర్ణ మేర్చుగా!
స్వస్తి.
ఇట్లు,
మూర్తి,జుత్తాడ.
జైహింద్.

6, జూన్ 2019, గురువారం

నాటి జీవన సరళి. రచన శ్రీ వల్లభవఝల అప్పలనరసింహమూర్తి.

0 comments

జైశ్రీరామ్. 
జైహింద్. 

5, జూన్ 2019, బుధవారం

రమ్మన్నన్ హరి యెట్లు వచ్చునిటకున్.

1 comments

జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణ
ఆర్యులకు శుభోదయమ్.

శా. హే దేవా! కనులార కానఁబడవా? హృష్టాత్ముగా చేయవా?
ఈ దీనుండు భవత్పదాబ్జ ములనాశించెన్ గనన్. వింటివా.
మోదంబున్ పదపద్మముల్ గనినచో ముక్తిన్ గనన్ నేర్తుగా.
మోదంబున్ కనిపించ భక్తతతి నిన్ పూజించుగా శ్రీహరీ.

ఉ. నీ పదపద్మపాళిని మునీశ్వరులైనను గాంచ నేర్చిరే?
మాపులు రేపులున్ వనజ మానదు నీపదసేవ లింక నీ
వేపగిదిన్ గనంబడగ నిచ్చటకున్ గనిపించవత్తువో
శ్రీపతీ! భావనంబుననె ప్రీతిని నిన్ గని తృప్తినందమా?

శా. అమ్మా! శ్రీహరి లోకరక్షకుఁడు నీవానంద సామ్రాజ్ఞివై
నెమ్మిన్నీ పతి పాద సేవనమునే నిత్యంబటుల్ చేయుటన్
రమ్మన్నన్హరి యెట్లు వచ్చునిటకున్ ప్రార్థించినన్. నీరజా!
మమ్ముంగావగ పంపుమమ్మ హరినే. మాపుణ్యముల్ పండనీ.

జైశ్రీమన్నారాయణ
భక్తజనవిధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

4, జూన్ 2019, మంగళవారం

కాళ్ళపై నిలఁబడన్ నేర్పున్ బ్రసాదించుమా.🏼 ప్రార్థన.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.

మ. నరసింహాచ్యుత! కేశవా! బుధనుతా! నారాయణా! మాధవా!
పరమానంద మనోజ్ఞతేజ మహితా! బ్రహ్మాండ భాండోదరా
ధర నిన్బ్రార్థనఁ జేయు భక్తతతి మేధాశక్తీనే పెంచుచున్,
నిరపేక్ష్యంబుగ కాళ్ళపై నిలఁబడన్ నేర్పున్ బ్రసాదించుమా.🏼

జైహింద్.

3, జూన్ 2019, సోమవారం

స్వర్ణకంకణ, కవిగండపెండేరసత్కార సభకు స్వాగతమ్

1 comments

  జైశ్రీరామ్.
ఆర్యులారా!  బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాంతరాజారావు గారికి స్వర్ణకంకణ, కవిగండపెండేరసత్కార సభకు స్వాగతమ్.
బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాంతరాజారావు గారికి హృదయపూర్వక అభినందనలు.
నిర్వాహకులను మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.

2, జూన్ 2019, ఆదివారం

మందారదామ. స్రగ్విణీ వృత్త గర్భ రాజహంస వృత్తము.,

2 comments

జైశ్రీరామ్. 
మందారదామ.  స్రగ్విణీ వృత్త గర్భ రాజహంస వృత్తము., 
రాజహంస వృత్తము త త త త త త త త  గ - ౧౩
శ్రీనాథ! నిన్ గొల్వ చేకొమ్ము వీవే. హరీ చేయినందించుమా చిత్స్వరూపుండవై.
దీనావనా! జ్ఞాన తేజమ్ము నీవే సుధీ ప్రాయమున్ గాంచవా! భక్త మందారమా!
మౌనంబదేలయ్య మాదైవమీవే సుమా. శ్రేయమున్ గొల్ప నా చిత్తమందుండుమా.
మానిన్ను నిత్యంబు మన్నింతునేనేరమాధ్యేయమీవేనయా దీన సంరక్షకా.

మందారదామ. త త త గగ - ౧. స్రగ్విణీ వృత్త గర్భ ర ర ర ర - ౭.
రాజహంస వృత్త గర్భస్త మందారదామవృత్తము., త త త గ గ.  యతి - ౭
శ్రీనాథ! నిన్ గొల్వ చేకొమ్ము వీవే.
దీనావనా! జ్ఞాన తేజమ్ము నీవే
మౌనంబదేలయ్య మాదైవమీవే
మానిన్ను నిత్యంబు మన్నింతునేనే.

మందారదామ. త త త గగ - ౧. స్రగ్విణీ వృత్త గర్భ ర ర ర ర - ౭.
రాజహంస వృత్త గర్భస్థ స్రగ్విణీవృత్తము., ర ర ర ర   గయతి - ౭
చేయినందించుమా చిత్స్వరూపుండవై.
ప్రాయమున్ గాంచవా! భక్త మందారమా!
శ్రేయమున్ గొల్ప నా చిత్తమందుండుమా.
ధ్యేయమీవేనయా దీన సంరక్షకా.
జైహింద్.

1, జూన్ 2019, శనివారం

డాలు బంధము. రచన శ్రీ కే,వీ.సుబ్రహ్మణ్యము

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

31, మే 2019, శుక్రవారం

శ్రీ గణపతి ప్రార్థన... అశ్వధాటి....రచన. చింతా రామకృష్ణ ాారావు.

1 comments

జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణ
ఆర్యులకు శుభోదయమ్.

🕉 గం గణపతయే నమః.

అశ్వధాటి.

శ్రీపార్వతీతనయ! మాపై దయం గలిగి నీ పాదముల్ కొలువనీ.
నీ పాద సేవనము పాపాపహారణము దీపింపఁ జేయు శుభముల్.
దీపించు భక్తినిట నీ పూజ చేసినను శాపాదులే తొలఁగుఁగా.
నీపై మదిన్ నిలిపి నీ పాదముల్ కొలుతు శ్రీపాద్ద్వయా గణపతీ!

జైశ్రీమన్నారాయణ
జైహింద్.

30, మే 2019, గురువారం

హలబంధము. రచన. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యము.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

29, మే 2019, బుధవారం

హనమజ్జయంతి శుభాకాంక్షలు

1 comments

జైశ్రీరామ్
జైశ్రీమన్నారాయణ
ఆర్యులకు శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.

దండక గర్భ సీసమాలిక.

శ్రీఆంజనేయా! ప్రసిద్ధప్రభావంబు
తో నిల్చి రక్షించు తోడు నీవె.

నీ పేరు విన్నన్ బునీతంబులౌ జన్మ
ముల్ దేవ! రావేల? పూజ్యపాద.

నీపాదపద్మమ్ములేపారఁ జూడన్ బ్రభావంబు కన్పించు వరలఁ జేయు.

శ్రీరామదూతా ప్రసీద ప్రసీదంచు
నిన్ వేడుదున్ రమ్ము నీడవగుము.

శ్రీరామ నామంబు నోరారఁగా పల్కు
నన్బ్రోచుదీవయ్య నయసుచరిత.

మాకున్ బరంబిచ్చు మాభాగ్యమున్ బెంచు
భక్తిన్ బ్రసాదించు బ్రహ్మచారి.

మాలోని భీతిన్ సమస్తంబు పోఁగొట్టి
మమ్మేలు మాస్వామి మహిత తేజ.

సీతామహాసాధ్వి మాతన్ పతిన్ జేర్చి
తీవే. నమస్తే. సుధీ నమామి.

గీ. స్వార్థరహితుల సుకవుల వర్ధనమును
చేయ వేడుదు నిన్ను నే చేయుమయ్య.
రామచంద్రుని సత్కృప మేముకనఁగ
ప్రేమతోఁ జేసి రక్షించు నీమముగను.

జైశ్రీరామ్
జయహనుమంతా

విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

సర్వతోముఖ బంధము. రచన. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యము.

0 comments

 జైశ్రీరామ్
జైహింద్.

28, మే 2019, మంగళవారం

అపురూప ద్విశతావధానము... బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

27, మే 2019, సోమవారం

కుంతీ విలాపము. రచన పాపయ్యశాస్త్రి. పాడినడి . . . ఘంటసాల.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

26, మే 2019, ఆదివారం

గురు శిష్య సంవాదము

1 comments

జైశ్రీరామ్
జైహింద్.

25, మే 2019, శనివారం

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు. .. .. .. బ్రహ్మశ్రీ ఛొప్పకట్ల సత్యనారాయణ

0 comments


జైశ్రీరామ్.
ఆర్యులారా!  మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు గురించి బ్రహ్మశ్రీ ఛొప్పకట్ల సత్యనారాయణ మహోదయులు వ్రాసియున్నారు. మనము తప్పక ఎరుఁగఁదగిన విషయములు. అందుకే మీ ముందుంచుచున్నాను. ఇక మీరే చూడండి.
 
నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.
1.అక్షరలక్ష:ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.
2.శబ్దశాస్త్రం:రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.
3.శిల్పశాస్త్రం:రచయిత కశ్యపముని.ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.
4.సూపశాస్త్రం:రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.
5.మాలినీ శాస్త్రం:రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.
6.ధాతుశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.
7.విషశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.
8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం): రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.
9.మల్లశాస్త్రం: రచయిత మల్లుడు.వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.
10.రత్నపరీక్ష: రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.
11.మహేంద్రజాల శాస్త్రం:సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.
12.అర్థశాస్త్రం:రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.
13.శక్తితంత్రం: రచయిత అగస్త్యముని.ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.
14.సౌధామినీకళ:రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.
15.మేఘశాస్త్రం: రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.
16.స్థాపత్యవిద్య:అదర్వణవేదం లోనిది.ఇంజనీరింగ్,ఆర్కితెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.
ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సాముద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.
స్వస్తి.
ఇంతటి చక్కని అపురూప సమాచారమందిమ్చిన సత్యనారాయణ మహాశయా!
మహితులు, సర్వ శాస్త్రములు మానవ జాతికనంత సత్ఫలో
 న్మహిమను గూర్చ వ్రాసిరయ. మానితమాశ్రమ, వ్యర్థమయ్యె నే
   డహితమయెన్ గ్రహింపమి నహర్నిశలున్ ధన వాంఛితంబునన్.
     మహితుఁడ! మీఱెరుంగునటు మాకునొనర్చిరి. మీకు సన్నుతుల్. 
 జైహింద్.

24, మే 2019, శుక్రవారం

విజేతలైన ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.

నిన్నన్ వెల్వడెనెన్నికల్ ఫలితముల్. నేర్పున్ ప్రదర్శించి రే
మన్నన్ భారత పౌరు లద్భుతముగా, నానందమందన్ న.మో.
నెన్నెన్ జాతి. శుభంబు దేశమునకున్. హృద్యంబు నీ దృష్టి. శ్రీ
మన్నారాయణ! శాంతిఁ గొల్పి, ప్రజలం బాలించగా చేయుమా.

విజేతలైన ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు.
ప్రజలు మిమ్ములను నమ్మి గెలిపించారు. త్రికరణశుద్ధిగా నీతిమార్గంలో ప్రజా సంక్షేమానికే మీ పాలన సాగినంతకాలం కొనసాగించండి. ప్రజల హృదయాలలో శాశ్వితంగా నిలిచిపొండి.
ఆ పరమాత్మ మీకు అన్నివిధముల తప్పక సహకరించునుగాక.

🏼జైశ్రీమన్నారాయణ🏼

జైహింద్.

పఱగు పంచాక్షరమ్ముల పక్షివరుడు . . ప్రహేళిక.

4 comments

జైశ్రీరామ్.
పఱగు పంచాక్షరమ్ముల పక్షివరుడు 
వాని తలదీయ నొక కవివర్యుడగును,
వాని తలద్రు౦ప వణిజుల కవసరమగు 
అసలు పదము దెల్పు జోహారొనర్తు 
సమాధానము:- 'కపోతారాజు' తల అంటే 
మొదటి అక్షరం తీసేస్తే "పోతరాజు" (ఒక కవివర్యుడు) దాని మొదటి అక్షరం తీస్తే 
'తరాజు' (తక్కెడ)వర్తకులకుపయోగ పడేది. 
జైహింద్.

23, మే 2019, గురువారం

పాండురంగ విభుని పదగుంఫనము. . . . బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! పాండురంగ విభుని పదగుంభనను బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ మహోదయులు కనులకు కట్టించిన విధానమును తిలకించండి.
పాండురంగ విభుని పదగుంఫనము
మ: గతి మధ్య స్తన కుంతల స్తబక వీక్షాగర్వ దుర్వార , యీ
సతిచే మానము యూనమయ్యె ; నిఁక నిస్సారంపు ప్రాణంబు దా
ల్చు తగుల్గాదని రోసి , యావృషలి వాలుంజూపుఁ గ్రొమ్మంట కా
హుతియౌ, బర్హి మృగేంద్ర కుంభి చమరీయూధంబు నేణంబులున్.
పాండురంగ మాహత్మ్యము-3 ఆ: 86 వ-పద్యం; తెనాలి రామకృష్ణుడు!
రాయల కాలంలో వికట కవిగా పేరొందినా ప్రౌఢకవిత్వ రచనారీతులలోగూడ తనను మించినవాడు లేడని నిరూపించినవాడు రామకృష్ణకవి. అతని ఉద్భటారాధ్య తరిత్రము; పాండురంగ మాహాత్మ్యములు ఆమహాకవి పదగుంఫనమునకు
నెలవులై "పాండురంగ విభుని పదగుంఫనమ్ము- వేరెవరికి? దక్కు నను ఖ్యాతినొందెను. ప్రస్తుత పద్యము పాండురంగ మాహాత్మ్యములోనిదియై , యతనిపద గుంభనారీతుల కద్దము పట్టుచున్నది. ఈపద్యంలో నిగమశర్మ మనసుబడి యడవికి గొనివచ్చిన 'కాపు పడచు' ఆఖేట (వేట) సామర్ధ్యముతోబాటు ఆమెయందమును వ్యంగ్యరీతులతో వివరించుచున్నాడు.
నడకలు - నడుము - కుచ కాఠిన్యము- కేశసంపద - చూపుల గర్వోన్నతిచే నీమె ఆవనములోని నెమళ్ళకు, సింహములకు ,కరి కుంభములకు, చమరీమృగములకు , లేడికదుపులకు గెలువరానిదై యవమానమును గల్గించుచున్నదట.! అయ్యో !ఈకాపుదానియందము మనకవమానమును గూర్చినదే! ఇఁక నీబ్రతుకేల ?యని బ్రతుకుపై రోతపుట్టి ఆమృగములన్నియు ఆకాపుపిల్ల కంటిచూపులనే మంటలలో బడి తమకుతామె మడియు చున్నవని కవి చమత్కారవర్ణనము.
వృషలి యను పదమునుప్రయోగించి, . ఆమె మాంసాహారి. వేటాడుట యామెకుసహజమేననుటను వివరించి ,దొరికిన జంతువును
దొరకినట్లు వేటాడి చంపుచున్నట్లుగా సూచించెను. జరుగుచున్నవిషయమది. దానిని కవి తనయూహతో కవితామయం చేస్తున్నాడు. ఇలా, ఆమె కున్నకొన్ని సౌందర్యలక్షణ ములను ప్రకటించుచు, మరియొక నూతన విషయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. అవేమిటో చూడండి.!
నడకలు- నెమలి నడకల నధిగమించుట.
నడుము: సింహ మధ్యమమును అధఃకరించుట.
కుచకాఠిన్యం: కుంభి కుంభముల నెదిరించటం.
కేశసంపద: చమరీ వాలములను వెనక్కి నెట్టటం.
చూపులు: లేడిచూపుల డిందుపరచటం.
ఇదిగో ఇవికారణాలుగా ఆమృగాలకు అవమానం జరిగినట్టుగా అవిభావించాయట. పరాభవానికి ప్రతీకారం తీర్చేదారే వాటికి లేదు. కాబట్టి దానికంటిమంటలకు ఆహుతియౌతున్నాయని కవి సమర్ధన!
" ప్రాణానపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు
ప్రాణాః తరంగ చపలాః మాన మాచంద్ర తారకమ్! - అని పెద్దలు చెపుతున్నారు కాబట్టి మృగాలైనా మంచిపనే చేస్తున్నట్టు మనకుతోచవచ్చు. నిజానికిదంతా కవిత్వంలో భాగమే! ఒక వంక ఆమెసౌందర్యం-మరొక వంక ఆమెలోని క్రూర స్వభావాన్ని
ఒకేమారు ఆవిష్కరిస్తున్నాడు కవి. అందుకు సాధనంగా "వాలుంజూపు" అనేపదాన్ని వాడాడు.సాధారణంగామనం వాలుచూపుకు ఓరచూపుగా అర్ధంచెపుతాం ఇక్కడ అలాక్కాదు. కత్తిలాంటి చూపు (వాలువంటి చూపు) అనే అర్ధంచెప్పుకోవాలి. అప్పుడు వాలు శస్త్రం కాబట్టి దానినే వేటాడు పరికరంగా ఆమె ఉపయోగించినది అనేభావం వస్తుంది. పైగా అదిక్రొమ్మంటయట! దావానలం వంటిది.
యింకెక్కడికి పోగలవు ?దానికళ్ళబడిన మృగమల్లా మరణానికి గురియౌతోంది.
ఈవిధంగా పదప్రయోగ విషయంలో చక్కని చాతుర్యమును ప్రదర్శించి లోకోత్తరమైన వర్ణనము నావిష్కరించినాడురామకృష్ణకవి.
1క్రమాలంకారం
2కావ్యలింగము.
నాన్యతోదర్శనీయమైన పదప్రయోగచాతుర్యంతో నవీనభావావిష్కరణమునొనర్చెడు తెనాలివారికి విబుధాంజలులను సమర్పిస్తూ!
స్వస్తి!
  జైహింద్.

22, మే 2019, బుధవారం

అష్టోత్తరశత సంఖ్య ప్రాశస్త్యమ్. . ..శ్రీ పురిఘెళ్ళ వెంకటేశ్వర్లు, శ్రీపీఠం

3 comments

జైశ్రీరామ్.
మహాద్భుత సంఖ్య 108 ప్రకృతి సూత్రాలలో అంతర్లీనంగా నిండి ఉంది.  విశ్వ నిర్మాణంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది.
జీవునికి, దేవునికీ మధ్య చక్కని వారధి 108.
మన దేవతలను పూజించే స్తోత్రాలు అష్టోత్తర శత నామాలతో కూడి ఉంటాయి.
జపమాలలో 108 పూసలు ఉంటాయి.
మానవుడిని మాధవునితో కట్టి ఉంచే ఆథ్యాత్మిక బంధం 108.
నటరాజు 108 నాట్య భంగిమలతో విశ్వమంతా నర్తిస్తున్నాడని ప్రసిద్ధి.
శ్రీచక్ర మహాయంత్రం లో 54 స్త్రీ అంతర్భాగాలు, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి.  రెండూ కలిపితే 108.
సంస్కృత భాషలో అక్షరాలు 54. వాటి స్త్రీ, పురుష రూపాలు కలిపితే 108.
భూమికీ, సూర్యునికీ మధ్య దూరం సూర్యుని వ్యాసానికి సుమారు 108 రెట్లు (సూర్యుని వ్యాసం 1.38 మిలియన్ కిలోమీటర్లు.  భూమికీ, సూర్యునికి మధ్య దూరం 149.6 మిలియన్ కిలోమీటర్లు.  అంటే దాదాపు 108 రెట్లు.
భూమి వ్యాసానికి సూర్యుని వ్యాసం 108 రెట్లు.  (భూమి వ్యాసం 12,742 కిలోమీటర్లు. సూర్యుని వ్యాసం 1.38 కిలోమీటర్లు.  దానికి ఇది 108 రెట్లు).
చంద్రుని వ్యాసానికి, భూమి-చంద్రుల మధ్య దూరం సుమారు 108 రెట్లు (చంద్రుని వ్యాసం 3,474 కిలోమీటర్లు.  భూమి, చంద్రుల మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు.  దానికిది 108 రెట్లు).
మానవ దేహంలో 108 మర్మ స్థానాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది.
మనిషి రోజుకి సరాసరి 21,600 సార్లు శ్వాసిస్తాడు.  ఈ శ్వాసలలో 10,800 సూర్యాంశ, 10,800 చంద్రాంశ.
12 రాశులు, 9 గ్రహాలూ ఆధారంగా ప్రకృతి గడియారంలో కాలచక్రం తిరుగుతోంది.  12క్ష్9=108.
నక్షత్రాలు 27.  ఒక్కొక్క నక్షత్రానికి పాదాలు 4.  27X4=108 నక్షత్ర పాదాలు.
ఒక మహాయుగం (కృత + త్రేతా + ద్వాపర + కలి యుగాలు కలిపితే) కాలమానం 43,20,000 సంవత్సరాలు. ఇది 108 కి గుణిజం.
గణిత శాస్త్రం లో కూడా 108 ఒక ఆసక్తికరమైన సంఖ్య.  (1) X (2 X 2) X (3 X 3 X 3) = 108.
ఒక వ్యక్తి ఆత్యాత్మికంగా అత్యున్నత స్థానం చేరాలంటే సాధనలో 108 మెట్లు ఎక్కాలని భావించే వారు ఎందరో ఉన్నారు.  అందుకే భగవంతునికీ, భక్తునికీ అనుసంధానమై ఉన్నది 108.
- పురిఘెళ్ళ వెంకటేశ్వర్లు, శ్రీపీఠం
జైహింద్.