గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఏప్రిల్ 2024, శుక్రవారం

మా తమ్ముఁడు దత్తాత్రేయ ప్రతిభార్ణవం.

 జైశ్రీరామ్.

శాII  ధాత్రిన్ శ్రీమరుమాలాన్వయుఁడ! దత్తాత్రేయ! సుజ్ఞాని! స
చ్ఛాత్రుల్ నేర్వగనెంచి పద్య సుధలో సత్పూజ్య శ్రీ శారదన్
స్తోత్రంబొప్పుగ వ్రాసితీవు సుగతిన్ శోభిల్ల భక్తి ప్రభల్,
మిత్రుల్ మెచ్చిరి, తమ్ముడా! శుభములన్ లీలన్ సదా గాంచుమా.
అన్న
చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

అన్నయ్యా! మీ వాత్సల్యానికి నోచుకున్న అదృష్టవంతుడను

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.