గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, డిసెంబర్ 2023, ఆదివారం

జానాతి వివిధాః భాషాః ... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో.  జానాతి వివిధాః భాషాః  -  జానాతి వివిధః కలాః,

ఆత్మానం నైవ జానాతి  -  యో న జానాతి సంస్కృతమ్.

తే.గీ.  వివిధ భాషలు తెలియనౌన్ సవివరముగ,

వివిధ కళలును తెలియనౌన్ విశ్వమునను

సంస్కృతము రానివారికి చక్కనైన

యాత్మసుజ్ఞానమెఱుగంగనవదు, నిజము.

భావము.

వివిధములైన భాషలు తెలియుచున్నవి.  వివిధములైన కళలు 

తెలియుచున్నవి.  ఎవరికయితే సంస్కృతము తెలియకున్నదో 

వారికి ఆత్మజ్ఞానము కూడా తెలియదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.