జైశ్రీరామ్.
శ్లో. జన్మ ప్రభృతి యత్కించిత్!
చేతసా ధర్మ మాచరేత్!
సర్వంతు నిష్ఫలం యాతి!
ఏకహస్తాభివాదనాత్!! (విష్ణు పురాణం)
తే.గీ. ఏకహస్తాభివాద మూహించనంత
దుష్ఫలంబిడు గమనింప దురితమద్ది,
పూర్వపుణ్యమంతయుకూడ పోవు నిజము.
హస్తములుమోడ్చి పెద్దలకంజలించు.
భావము. పుట్టినది మొదలుకొని గావించుతూ వచ్చిన ధర్మము
ఏకొంచెమున్నను అదికూడా ఒక్కచేతితో పెద్దలకు అభివాదనము
చేయుటవల్ల నశించిపోతుంది. ఎందువల్లనంటే ఏకహస్తాభివాదనమందు
అవినయమే భాసిస్తుంటుంది.దానివల్ల సర్వధర్మములు నిష్ఫలమైపోతాయి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.